calender_icon.png 23 October, 2024 | 3:52 AM

నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ విచారణ

23-10-2024 02:13:37 AM

హైదరాబాద్, అక్టోబర్ 22 (విజయక్రాంతి): కాళేశ్వరం వ్యవహారంలో బుధవారం నుంచి మళ్లీ విచారణ తిరిగి ప్రారంభం కానుంది. దసరా పండుగ తర్వాత కొనసాగుతున్న ఈ విచారణలో అధికారుల క్రాస్ ఎగ్జామినేషన్ జరగనున్నది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆనకట్టల నిర్మాణంలో పనిచేసిన ఇంజినీర్లు, రిటైర్డ్ ఇంజినీర్లు, ఉన్నతాధికారులను జస్టిస్ పీసీ ఘోష్ విచారించనున్నారు.

గ తంలో విచారణ చేసిన వారిని కూడా మళ్లీ పిలవనున్నారు. ఈ నెల 29 వరకు ఈ క్రాస్ ఎగ్జామినేషన్ కొనసాగనున్నది. కాగా మంగళవారం  నీ టిపారుదల శాఖ అధికారులతో జస్టి స్ ఘోష్  సమావేశమయ్యారు. మ రోవైపు వీలైనంత త్వరగా తుది నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ డీజీని జస్టిస్ ఘోష్ ఆదేశించారు.

గుత్తేదారు కంపెనీల ప్రతినిధులను సైతం విచారించ నున్నారని సమాచారం. నిర్మాణానికి సంబంధించిన అన్ని రికార్డులు, సం స్థల లావాదేవీల వివరాలను కమిషన్ పరిశీలించనున్నది. ఎన్డీఎస్‌ఏ, కాగ్ నివేదికల ఆధారంగా విచారణ కొనసాగనున్నది.

బ్యారేజీల నిర్మాణానికి సంబంధించిన ప్లేస్‌మెంట్ రిజి స్టర్, ఎం బుక్‌లను కూడా తీసుకురావాలని ఇంజినీర్లను కమిషన్ ఆదేశిం చింది. విచారణను తప్పుదారి పట్టించినా, నేరపూరితంగా వ్యవహరించి నా వారిపై అవినీతి నిరోధక చట్టం కింద కేసులు నమోదు చేయాలని, భవిష్యత్తులో ప్రమోషన్లు లేకుండా చూడాలని ప్రభుత్వానికి సిఫారసు చేసే యోచనలో కమిషన్ ఉంది.