calender_icon.png 22 September, 2024 | 8:50 AM

కాళేశ్వరాన్ని పనికిరాకుండా చేశారు

22-09-2024 12:41:30 AM

మల్లన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు ఎల్లంపల్లి ప్రాజెక్టువే

తప్పును కప్పిపుచ్చుకునేదుకు హరీశ్‌రావు ప్రయత్నం

మంత్రి పొన్నం ప్రభాకర్

హైదరాబాద్, సెప్టెంబర్ 21 (విజయక్రాం తి): మల్లన్నసాగర్‌కు వచ్చిన నీళ్లు కాళేశ్వరం జలాలా లేక ఎల్లంపల్లి నీళ్లా అనేది హరీశ్‌రా వు సమాధానం చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. కేసీఆర్ నిర్వాకం వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాకుండా పో యిందన్నారు. శనివారం గాంధీభవన్‌లో మంత్రి మీడియాతో మాట్లాడారు. మల్లన్నసాగర్‌కు ఎల్లంపల్లి నుంచి నీళ్లు తీసుకుంటే.. అవి కాళేశ్వరం జలాలని హరీశ్‌చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. 

తాను ఎంపీ గా ఉన్నప్పుడే ఎల్లంపల్లి ప్రాజెక్టు  పూర్తుంద ని, ప్రాజెక్టుకు సీఎం హోదాలో వైఎస్‌ఆర్ శంకుస్థాపన చేశారన్నారు. తుమ్మిడిహెట్టితో పాటు పలు పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని  అన్నారు. ఇప్పటికే గౌరవెల్లి ప్రాజెక్ట్‌కు రూ.431 కోట్లను కేటాయించినట్లు పే ర్కొన్నారు. తాము చేపట్టిన ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ఎల్లంపల్లి, నందిమేడారం, లక్ష్మి బ్యారేజీ, మిడ్ మానేరు, అనంతగిరి రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్ ఉన్నాయని మంత్రి పొన్నం స్పష్టం చేశారు.  అనంతరం కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి నివాళి అర్పించారు. 27న  బాపూజీ జయంతిని ప్రభుత్వపరంగా ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు.