- దీంతో జియో టెక్నికల్ పరీక్షలు సాధ్యం కాదు
- ఇప్పుడు ఫిజికల్ పరీక్షలకు మాత్రమే అవకాశం
- రాష్ట్రంనుంచి ఇంకా ఎన్డీఎస్‌ఏకు డేటా అందలేదు
- కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం
హైదరాబాద్, నవంబర్ 26 (విజయక్రాంతి): రాష్ర్ట ప్రభుత్వం జియో టెక్నికల్ పరీక్షలు పూర్తి చేసి వివరాలు అందించకపోవడం వల్లే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల ఆన కట్టలకు సంబంధించిన ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యానికి కారణమని కేంద్ర జలశక్తి శాఖ సలహాదారు వెదిరే శ్రీరాం తెలిపారు.
జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముం దు హాజరైన ఆయన కాళేశ్వరం బ్యారేజీలకు సంబంధించిన అంశాలపై గతంలో తాను కమిషన్‌కు ఇచ్చిన వివరాలను బుధవారం అఫిడవిట్ రూపంలో సమర్పించారు. అనంతరంఆయన బీఆర్‌కే భవన్ వద్ద మీడియా తో మాట్లాడుతూ కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక మొదలు మేడిగడ్డ ఆనకట్ట పియర్స్ కుంగిన వరకు అన్ని అంశాలను అఫిడవిట్ లో నివేదించినట్లుగా వెల్లడించారు.
ఎన్డీఎస్‌ఏ నిపుణుల కమిటీ నివేదిక ఆలస్యానికి గల కారణాలను కమిషన్‌కు తెలిపినట్లు చె ప్పారు. ఎన్డీఎస్‌ఏ చెప్పిన జియోటెక్నికల్ పరీక్షలను రాష్ర్ట ప్రభుత్వం ఇంకా పూర్తి చే యలేదన్నారు. ఎన్డీఎస్‌ఏ సిఫారసు చేయనప్పటికీ రాష్ర్ట ఇంజినీర్లు బ్యారేజీ కింద ఉన్న గుంతల్ని పూడ్చివేశారని, దీంతో అక్కడ జియో టెక్నికల్ డేటాను కోల్పోయినట్లు తెలిపారు.
ఇదే విషయాన్ని ఎన్డీఎస్‌ఏ కమిటీ ప్రభుత్వానికి కూడా తెలిపిందన్నారు. జియో టెక్నికల్ పరీక్షలు ఇక సాధ్యం కాదని, కొన్ని చోట్ల జియో ఫిజికల్ పరీక్షలు చేసి వివరాలు పంపాలని రాష్ర్ట ప్రభుత్వానికి చెప్పినట్లు తె లిపారు.
ఎన్డీఎస్‌ఏకు ప్రభుత్వం నుంచి ఇం కా డేటా అందలేదని, డేటా అందిన తర్వాత నివేదిక తయారు చేసేందుకు రెండు నెలల సమయం పడుతుందని ఎన్డీఎస్‌ఏ తెలిపిందన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక అనేది విచారణ లో ఒక అంశం మాత్రమేనని తెలిపారు.