పెద్దపల్లి, మంథని,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన పెద్దపల్లి జిల్లా మంథని మండలంలోని పార్వతి (సుందిళ్ల) బ్యారేజీ కరకట్టకు ప్రమాదం ప్రమాదం పొంచి ఉంది. మూడు సంవత్సరాల క్రితం వరుసగా కురిసిన వర్షాలు పార్వతి బ్యారేజీలోకి వచ్చి చేరిన వరద నీటి ప్రవాహంతో పార్వతి బ్యారేజీ కరకట్ట డామేజ్ అయింది. అధికారులు అప్పుడు తాత్కాలికంగా మరమ్మతులు చేపట్టారు. గత మూడు రోజులుగా వరుసగా కురుస్తున్న వర్షాలతో కరకట్ట పూర్తిగా తెగిపోయే అవకాశం కనిపిస్తోంది. కరకట్ట కోతకు గురైతే డ్యాం పక్కనే ఉన్న బెస్తపల్లి, సిరిపురం గ్రామాలకు ప్రమాదం పొంచి ఉందని గ్రామస్తులు భయందోళనకు చెందుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే మరమ్మతులు చేపట్టాలని గ్రామాల ప్రజలు కోరుతున్నారు.