calender_icon.png 30 April, 2025 | 7:21 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కల్లాస్!

30-04-2025 12:38:11 AM

ప్రాజెక్టులో ఇష్టారాజ్యంగా పెద్దమనిషి మార్పులు

  1. కమీషన్లకు కక్కుర్తిపడే అంచనాల పెంపు 
  2. డీపీఆర్‌లు అనేకసార్లు మార్చారు 
  3. రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ల 
  4. నివేదిక బుట్టదాఖలు 
  5. నిజం ఒప్పుకుని బీఆర్‌ఎస్ నేతలు క్షమాణలు చెప్పాలి 
  6. తప్పు చేసిన వారిపై 
  7. చట్టపరమైన చర్యలు
  8. ఎన్డీఎస్‌ఏ నివేదికపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో మంత్రి ఉత్తమ్ మండిపాటు

హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కమీషన్లకు కక్కుర్తిపడే కాళేశ్వరం ప్రాజెక్టు అంచనాలను కేసీఆర్ భారీగా పెంచారని నీటిపారుద ల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. ఇందులో భాగంగానే ప్రాజెక్టు డీపీఆర్‌ల ను అనేకసార్లు మార్చేశారని విమర్శించారు. ఐదుగురు రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్లు అభ్యంతరం తెలిపినా తుమ్మిడిహట్టిని కాదని మేడిగడ్డ వద్ద బ్యారేజీని నిర్మించారని దుయ్యబట్టారు.

కాళేశ్వరాన్ని చేపట్టేందుకే పెద్దమనిషి (కేసీఆర్) ప్రాణ హిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్‌ను ఇష్టారాజ్యంగా మార్చేశారని మండిపడ్డారు. రూ.80 వేల కోట్లతో ప్రాజెక్టును నిర్మిస్తామని చెప్పి, రూ.లక్ష కోట్లు అప్పు చేశారని విమర్శించారు. కేసీఆర్ చీఫ్ ఇంజినీర్‌గా అవతారమెత్తి కనీసం డీపీఆర్ కూడా లేకుండా ప్రాజెక్టును నిర్మించి సర్వనాశనం చేశారన్నారు.

కేసీఆర్ ఎలా చెప్తే అలా నిర్మించడంతో చివరకు ప్రాజెక్టు పనికి రాకుం డా పోయిందన్నారు. ఈ బ్యారేజీలను ఉపయోగించుకునే పరిస్థితి లేదని, వాటిని తిరిగి ఉప యోగంలోకి తేవాలనే దానిపై అధ్యయనం చేయాల్సి ఉంటుందని నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) తేల్చి చెప్పిందన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదిక          


మేరకే తమ ప్రభుత్వం ముందుకు వెళ్తుందని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సెక్రటేరియట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, నిర్వహణలో చోటు చేసుకున్న లోపాలపై ఎన్‌డీఎస్‌ఏ ఇచ్చిన నివేది కపై ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్ ప్రభుత్వం కాళేశ్వరంపేరుతో లక్షల కోట్లు నాశనం చేసి, రాష్ట్ర రైతాంగాన్ని, ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసిందన్నారు. దేశ చరిత్రలో ఎన్నడూ లేనంత హోరమైన మానవ నిర్మిత విపత్తును సృష్టించి అపఖ్యాతిని మూటగట్టు కున్న బీఆర్‌ఎస్ ప్రభుత్వ అసమర్థతను ఈ నివేదిక స్పష్టంగా వివరించిందన్నారు. గత ప్రభుత్వ అక్రమాల వల్ల రాష్ట్ర ప్రతిష్ఠ దిగజారిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయినా సిగ్గు లేకుండా బీఆర్‌ఎస్ నాయకులు ఎన్డీఎస్‌ఏ నివేదికను తప్పుబడు తున్నారని విమర్శించారు. ఇప్పటికేనా చేసిన తప్పు ఒప్పుకుని క్షమాణలు చెప్పాలని డిమాండ్ చేశారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణం కరెక్టు కాదని రిటైర్డ్ సీఈలు ఇచ్చిన నివేదికను బుట్టదాఖలు చేసి, ఒక పద్ధతి అనేది లేకుండా ప్రాజెక్టును నిర్మించారన్న ఎన్‌డీఎస్‌ఏ నివేదికను ఈ సందర్భంగా మంత్రి ఉటంకిం చారు. ప్రాజెక్టు నిర్మాణం చేపట్టిన 6 నెలల తర్వాత డీపీఆర్‌ను తయారు చేసినప్పటికీ కనీసం దాని ప్రకారం కూడా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టలేదని విమర్శించారు. 

కార్పొరేషన్ల పేరుతో అప్పులు

ప్రాజెక్టు నిర్మాణం కోసం రకరకాల కార్పొరేషన్ల పేరుతో బీఆర్‌ఎస్ పెద్దలు అప్పులు చేశారని, అదీ చాలదన్నట్టు ఎక్కువ వడ్డీకి స్వల్పకాలిక రుణాలను కూడా తీసుకున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపిం చారు. గత ప్రభుత్వం చేసిన ఈ అప్పులకు తమ ప్రభుత్వం ఏటా రూ.16 వేలకోట్లను వడ్డీలుగా చెల్లిస్తోందన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో నేషనల్ డ్యాం సేఫ్టీ అధికారుల సూచనలను ఎక్కడా పాటించలేదని మంత్రి పేర్కొన్నారు. కనీసం సాయిల్ టెస్ట్ కూడా చేయకుండానే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను నిర్మించారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో నిర్మించిన మేడిగడ్డ వాళ్ల హయాంలోనే కూలిపోయిందని వివమర్శించారు. ప్రాజెకు ్టనిర్మాణం లోని లోపాలతో పాటు కనీస నిర్వహణ, మరమ్మతులు కూడా లేకపోవడం వల్లే బ్యారేజీ కుంగిపోయిందని నివేదిక స్ప ష్టం చేసిందన్నారు.  బ్యారేజీ ముందు ఉన్న చెత్తాచెదారాన్ని కనీసం ప్రాజెక్టు ప్రారంభోత్సవం రోజున కూడా తొలగించలేదన్నారు. ఫలితంగా బ్యారేజీకి రంధ్రాలు పడి, ఫౌండేషన్ బలహీనపడిందన్నారు. బ్యారేజీ పూర్త యిన మొదటి ఏడాదిలోనే ఇంజినీర్లు లోపాలను గుర్తించినా గత ప్రభుత్వం పట్టించు కోలేదని ఆరోపించారు. ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్ సర్కారు హయాంలోనే ఎన్డీఎస్‌ఏ ప్రాథమిక నివేదిక ఇచ్చిందన్నారు. ఆ నివేదికలో మేడిగడ్డ బ్యారేజీకి సంబంధించిన లో పాలను స్పష్టంగా తెలిపిందన్నారు. అన్నా రం, సుందిళ్ల బ్యారేజీల్లోనూ సీపేజీ సమస్య ఉందని ఆ నివేదిక బయటపెట్టిందన్నారు. 

ప్రజలను తప్పుదారి పట్టిస్తున్నారు

కాళేశ్వరం ప్రాజెక్టుపై నిత్యం అసత్యాలు ప్రచారం చేస్తూ రాష్ట్ర ప్రజలను బీఆర్‌ఎస్ నాయకులు తప్పుదారి పట్టిస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. 16 లక్షల ఎకరాల ఆయకట్టకు నీళ్లు అందించాలనే ఉద్దేశంతో రూ.38వేల కోట్లతో తుమ్మిడిహట్టి ప్రాజెక్టు కోసం అప్పటి సీఎం వైఎస్ రాజశేఖర్‌రెడ్డి శంకుస్థాపన కూడా చేశారని, బీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్లకు జాతీయ హోదా ఇవ్వాలంటూ కేంద్రానికి లేఖ కూడా రాసిందని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేశారు. కానీ కేసీఆర్ చీఫ్ ఇంజినీర్ అవతారమెత్తి, ప్రాజెక్టును రీడిజైన్ చేశారని విమర్శించారు. దేశంలో 5700 బ్యారేజీలు, ప్రాజెక్టుల్లో ఏ సమస్య వచ్చినా ఎన్డీఎస్‌ఏ బృందం వెళ్లి పరిశీలించి నివేదిక ఇస్తుందని పేర్కొన్నారు. ఆ సంస్థలో జాతీయ, అంతర్జాతీయస్థాయి నిపుణులు ఉంటారని మంత్రి వెల్లడించారు. బీఆర్‌ఎస్ నేతల కంటే ఎన్డీఎస్‌ఏలో పనిచేసే వారికి కొంచెం ఎక్కువ జ్ఞానం ఉంటుందని తాము భావిస్తున్నామంటూ గత పాలకుల ను ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఎద్దేవా చేశారు. నిర్మా ణ దశలో ఉన్న ప్రాజెక్టుల్లో సాధారణంగా కేవలం 2, 3 టీఎంసీల నీటిని మాత్రమే ని ల్వ చేస్తారని, అయితే  తాము అద్భుతం చేశామని గొప్పలు చెప్పుకోవడానికి బీఆర్‌ఎస్ పాలకులు బ్యారేజీల్లో 14-15 టీఎంసీల నీ టిని నిల్వ చేశారని విమర్శించారు. 

ఆ ఘనత మా ప్రభుత్వానిదే..

వర్షాలు వచ్చి ఎస్‌ఆర్‌ఎస్‌పీ స్టేజ్-2 కింద నీళ్లు అందుబాటులోకి వస్తే ఆ ఘనతను బీఆర్‌ఎస్ నాయకులు కాళ్వేశ్వరం ఖాతాలో వేసుకున్నారని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరం కుంగి పోయిన తర్వాత కూడా రాష్ట్రంలో 153 మెట్రిక్ టన్నుల వరి పండిందన్నారు. ఖరీఫ్, రబీ సీజన్లలో కలిపి రాష్ట్రంలో 280 లక్షల మెట్రిక్ టన్నుల వరి పండిందన్నారు. వరిసాగు గణనీయంగా పెంచేందుకు చర్యలు తీసుకున్న ఘనత తమ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. ఎన్డీఎస్‌ఏ నివేదికపై క్యాబినెట్ లో చర్చిస్తామని.. ప్రాజెక్టు విషయంలో అధికారుల పొరపాటు ఉంటే వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. అలాగే, అధికారులకు ఆదేశాలిచ్చిన వారిపైనా చట్టప్రకా రం చర్యలు తప్పవని మంత్రి స్పష్టం చేశారు. 

తొలుత సీతమ్మసాగర్‌కు అనుమతివ్వలేదు 

సీతమ్మసాగర్ ప్రాజెక్టు కోసం తొలుత తాను కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖను సంప్రదిస్తే ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణలోపాలను సాకుగా చూపి, సీతమ్మసాగర్‌కు అనుమతులను నిరాకరించారని వెల్లడించారు. చివరకు సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు వచ్చిన తర్వాత ప్రాజెక్ట్ నిర్మాణం కోసం కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ అనుమతలు ఇచ్చిం దన్నారు. గత పాలకులు ఢిల్లీలో రాష్ట్రం పరువు తీశారని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. 

కనీసం భద్రతా ప్రమాణాలు పాటించలేదు

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో ఎలాంటి కనీస భద్రతా ప్రమాణాలను పాటించలేదని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. సుందిళ్ల, అన్నారం బ్యారేజీలను కట్టాల్సిన చోట కట్టలేదన్నారు. ఒక బ్యారేజీకి ఇంకో బ్యారేజీకి పొంతన లేకుండా నిర్మాణాలు చేపట్టారని విమర్శించారు. తుమ్మిడిహట్టి దగ్గర కూడా ప్రాజెక్టు నిర్మిస్తామని చెప్పి, గత ప్రభుత్వం  పదేళ్లలో కనీసం తట్టెడు మట్టి కూడా ఎత్తిపోయలేదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాలకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. తుమ్మిడిహట్టి దగ్గర నీటి లభ్యత లేదనడం శుద్ధ అబద్ధమని పేర్కొన్నారు.