* మధుప్రియ పాట చిత్రీకరణ ఎఫెక్ట్
మహదేవపూర్, జనవరి 26: జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ పూర్ మండలంలోని కాళేశ్వరం ముక్తేశ్వర క్షేత్ర ఈవోపై బదిలీ వేటు పడింది. ఆలయం వద్ద పాట చిత్రీకరణకు గాయని మధుప్రియ కాలేశ్వరం ఈవో మారుతిని ఫోన్ ద్వారా అనుమతి కోరారు. ఆలయం బయట, గోదావరిలో పాట చిత్రీకరణకు ఈవో అనుమతించారు. గర్భగుడిలోనూ చిత్రీకరిం చారు.
దీంతో హిందూ సంఘాలు, భక్తులు అభ్యంతరం వ్యక్తం చేశారు. గర్భగుడి అర్చకుడు రామకృష్ణకు రీజినల్ జాయింట్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. ఆదివారం దేవాదా యశాఖ అడిషనల్ కమిషనర్ జ్యోతి ఈవోను బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చారు.