calender_icon.png 27 September, 2024 | 6:51 PM

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ

27-09-2024 03:44:59 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు గజ్వేల్ ఈఎన్సీ, కాళేశ్వరం కార్పొరేషన్ ఎండీ హరిరామ్ విచారణకు హజరయ్యారు. హరిరామ్ ను 90కి పైగా ప్రశ్నలు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ అడిగారు. కాళేశ్వరం కార్పొరేషన్ ఆర్థిక అంశాలపై హరిరామ్ ను ప్రశ్నించిన కమిషన్ ముందు శనివారం మరోసారి హజరు కానున్నారు. ఇవాళ సమాధానాలివ్వని ప్రశ్నలకు రేపు దస్త్రాలు ఇస్తానన్న హరిరామ్ అప్పటి సీఎస్ ఎస్కే జోషి, ఈఎన్సీ మురళీధర్ పేర్లను ప్రస్తావించారు.

కార్పొరేషన్ ద్వారా బ్యాంకులకు రూ.29,737 కోట్లు, గుత్తేదారులకు రూ.64 వేల కోట్లు చెల్లించినట్లు కార్పొరేషన్ ఫైనాన్షియల్ స్టేట్ మెంట్ ను ప్రభుత్వానికి ఇచ్చినట్లు హరిరామ్ తెలిపారు. మేడిగడ్డ బ్లాక్ డామేజ్ కు బాధ్యులెవరని హరిరామ్ ను కమిషన్ ప్రశ్నించడంతో గేట్స్ ఆపరేషన్, నిర్వహణ సరిగ్గా లేకపోవడమే ప్రధాన కారణమన్నారు. ఉన్నతస్థాయి కమిటీ మినిట్స్ ను కాళేశ్వరం సీఈ అనుసరించలేదని హరిరామ్ పేర్కొన్నారు.