27-02-2025 02:30:29 AM
ఏప్రిల్ చివరి వరకు కమిషన్ గడువు పెంపు
హైదరాబాద్, ఫిబ్రవరి 26(విజయక్రాంతి): కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ గురువారం నుంచి ప్రారంభం కానుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణాల్లో జరిగిన అవకతవకలపై విచారణ జరిపేందుకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌కు ఈ నెలాఖరు వరకు గడువు ఉండగా.. విచారణ పూర్తి కాకపోవడంతో ఏప్రిల్ నెలాఖరు వరకు పొడగి స్తూ ప్రభుత్వం నిర్ణ యం తీసుకుంది.
గతంలో కమిషన్ ముందు హాజరైన వారిలో కొందరిని కమిషన్ మళ్లీ విచారించనుంది. అనుమతులు, నిర్మాణ పనుల్లో కీలకంగా వ్యవహరించిన ఇంజినీర్లను ప్రశ్నించనుంది. ఇప్పటివరకు కమిషన్ 109 మందిని విచారించింది.