ఆగస్టు 30 వరకు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు
హైదరాబాద్, జూన్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి, అవకతవకలు, అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటుచేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ గడువును రెండు నెలలపాటు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌ల నిర్మాణంలో వచ్చిన ఆరోపణలపై సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పినాకీ చంద్రఘోష్‌ను కమిషన్‌గా నియమించింది. ఆ ఆరోపణలను లోతుగా విచారించి జూన్ 30 లోగా నివేదికను ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. అయితే ఈ గడువులోగా విచారణ పూర్తి కాలేదు. ఇంకా విచారణ చాలా వరకు మిగిలే ఉంది. దీనితో కమిషన్ గడువును పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు రెండు నెలలపాటు కమిషన్ గడువును పెంచుతూ శనివారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.