30-04-2025 01:16:22 AM
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టు అక్ర మాలపై విచారణ జరుపుతున్న జస్టి స్ పినాకీ చంద్ర ఘోష్ కమిషన్ గడువును మరో నెల రోజులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఈ నెలాఖరు తో ముగియనున్న కమిషన్ గడువు తాజాగా మే 31 వరకు పొడిగించినట్లయింది. 2024 మార్చిలో ఏర్పా టైన కమిషన్ మొదట 100 రోజుల గడువుతో ఏర్పాటైంది.
అయితే ఇప్పటికే నివేదిక దాదాపుగా పూర్తి కాగా, గత ప్రభుత్వ పెద్దలను మాత్ర మే విచారించాల్సి ఉంది. దీంతో విచారణను మే నెలలోగా పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే అవకాశం ఉంది. అందుకే కేవలం నెల రోజులే గడువు మాత్రమే పెంచారని తెలుస్తోంది. కాగా నీటిపారుద ల శాఖ ఈఎన్సీ అనిల్‌కుమార్‌ను మంగళవారం కాళేశ్వరం కమిషన్ విచారణకు పిలిపించిన సంగతి తెలిసిందే. నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్డీఎస్‌ఏ) నివేదికను కమిషన్‌కు ఈఎన్సీ అందజేసినట్టు సమాచారం.