calender_icon.png 29 April, 2025 | 9:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం కమిషన్ గడువు పెంపు

29-04-2025 03:21:45 PM

హైదరాబాద్‌,(విజయక్రాంతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై దర్యాప్తు చేస్తున్న జ్యుడీషియల్ కమిషన్ గడువును రాష్ట్ర ప్రభుత్వం మరో నెల రోజులు పొడిగించింది. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలను దర్యాప్తు చేస్తున్న కమిషన్‌కు జస్టిస్ పీసీ ఘోష్ చైర్మన్‌గా పనిచేస్తున్నారు. విచారణలో భాగంగా ఇప్పటికే పలువురు అధికారులు, నిపుణులను ప్రశ్నించిన విషయం తెలిసిదే.

అలాగే నీటిపారుదలశాఖ మంత్రి ఓఎస్డీగా విశ్రాంత ఎస్ఈ భీంప్రసాద్ నియామితులయ్యారు. నాగర్ కర్నూల్ ఎస్ఈగా విశ్రాంత ఎస్ఈ జీ.విజయ భాస్కర్ రెడ్డి, నాగర్ కర్నూల్ చీఫ్ ఇంజనీర్ గా విజయ భాస్కర్ రెడ్డికి అదనపు బాధ్యతాలను అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తాజా ఉత్తర్వు జారీ చేసింది.