calender_icon.png 16 January, 2025 | 2:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాళేశ్వరం బరాజ్‌లకు వరద తాకిడి

01-07-2024 01:31:24 AM

  • ఎగువన కురుస్తున్న వర్షాలకు జలకళ

దిగువకు జలాలు విడుదల

నిలిచిన మేడిగడ్డ ‘మరమ్మతు’ పనులు

జయశంకర్ భూపాలపల్లి, జూన్ 30(విజయక్రాంతి): రెండు మూడు రోజులుగా ఎగువన కురుస్తున్న వర్షాలకు గోదావరి, ప్రాణహితలోకి భారీ వరద నీరు చేరుతోంది. దీంతో కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోనిమేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బరాజ్‌కు వరద పోటు తగిలింది. నీటి పారుదలశాఖ అప్రమత్తమై బరాజ్‌ల నుంచి దిగువకు వదులుతు న్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవ్‌పూర్ మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు ఆదివారం సాయంత్రం నాటికి 8 వేల పైచిలుకు క్యూసెక్కుల వరద చేరింది.

బరాజ్ పరిధిలో మరమ్మతు పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇరిగేషన్ అధికారులు 85 గేట్లకు 84 గేట్లు ఎత్తి దిగువకు జలాలు వదులుతున్నారు. వచ్చిన వరదను వచ్చినట్లే బయటకు విడిచిపెడుతున్నారు. మరమతు పనుల్లో భాగంగా ఇప్పటికే గ్రౌటింగ్, షీట్ ఫైల్స్ పనులు పూర్తి కాగా అప్ అండ్ డౌన్ స్టీంలో చేపట్టిన సీసీ బ్లాక్ రీ ఎరెంజ్‌మెంట్ పనులు చివరి దశలో ఉన్నాయి. ప్రస్తుతం ఏడో బ్లాక్‌లోని 20వ గేట్ కటింగ్ చేసే పనిలో ఇంజినీర్లు నిమగ్నమయ్యారు.

కానీ వరద పోటు కారణంగా పనులను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురిస్తే బరాజ్‌లన్ని జలకళను సంతరించుకుంటాయని, దీంతో ఆయకట్టు సస్యశ్యామలమవుతుందనే ఆశాభావంతో రైతులు ఉన్నారు.