- షాబాద్‌లో సొంత పార్టీ కార్యకర్తల నిరసన
- భీమ్ భరత్‌ను కలుపుకుపోవడం లేదని ఆగ్రహం
చేవెళ్ల, ఆగస్టు 28: చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం షాబాద్ మండలంలో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీకి వెళ్లిన ఆయనను సొంత పార్టీ కార్యకర్తలే అడ్డుకుని, కారుపై కోడిగుడ్లతో దాడి చేశారు. నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి పామెన భీమ్ భరత్‌ను ఎందుకు కలుపుకుపోవడం లేదని ప్రశ్నించారు. గత పదేళ్ల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారిని కాకుండా బీఆర్‌ఎస్ నుంచి వచ్చిన వారిని వెంటేసుకుని తిరుగుతున్నారని ఆగ్ర హం వ్యక్తం చేశారు. ‘యాదయ్య గో బ్యాక్.. యాదయ్య డౌన్ డౌన్’ అని నినాదాలు చేశా రు. దీంతో ఎమ్మెల్యే కారు దిగకుం డా అరగంట సేపు అందులోనే కూర్చుండిపోయా రు. సీఐ కాంతారెడ్డి, ఎస్సైలు, పోలీసు సిబ్బం ది అక్కడకు చేరుకుని కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు.