కలంకారీ.. సహజ సిద్ధమైన రంగులతో.. చూడముచ్చటైన డిజైన్లతో.. ప్రకృతి హరివిల్లును తనలో దాచుకుంటుంది. కలంకారీ అంచులో ఉండే లతలు, పువ్వులు, బొమ్మలు, మగువ దృష్టిని ఆకట్టుకుంటాయి. ఈ డిజైన్లకు ఉపయోగించే నిండు రంగులు కంటికి ఇంపుగా, అందంగా ఉంటాయి. ఒకప్పుడు కలంకారీ చీరలు అంటే చాలా ఫేమస్ అని అందరికీ తెలుసు.
కానీ ట్రెండ్ మారింది.. ప్రస్తుతం విభిన్న డిజైన్లతో మార్కెట్‌లో దర్శనమిస్తున్నాయి. పండుగలు, పెళ్లిళ్లు, ఫంక్షన్లు.. ఇలా అకేషన్ ఏదైనా కానీ కలంకారీ లెహంగాకు ఉన్న ప్రత్యేకతే వేరు. హుందాగా, స్టులీష్‌గా, సంప్రదాయబద్దంగా కనిపించాలంటే.. ఒక్కసారైనా కలంకారీ లెహంగను ట్రై చేయాల్సిందే..