calender_icon.png 20 March, 2025 | 3:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వడదెబ్బ నివారణపై కళాజాత

20-03-2025 12:56:39 AM

మార్చి 19(విజయక్రాంతి) : నారాయణ పేట జిల్లా కలెక్టర్ సిక్త పట్నాయక్ ఆదేశాను సారంగా డి. పి. ఆర్. ఓ. రషీద్ ఆధ్వర్యంలో తెలంగాణ సాంస్కృతిక సారధి కళాకారులు బుధవారం ఉదయం నారాయణపేట దామరగిద్ద మండలంలోని తిరుమలాపూర్ ,ముస్తాపెట్ గ్రామాల్లో వడదెబ్బ నివారణకై మరియు అక్షరాస్యతపై ప్రజలకు కళారూ పాల ద్వారా అవగాహన కల్పించడం జరిగింది.

కళాకారులు పల్లె జానపదాలు ద్వారా వడదెబ్బ వల్ల మెదడుకు వాపు వస్తుందని కిడ్నీలు ఊపిరితిత్తులు కాలేయం వాడిపో తుందని తద్వారా గుండెకు రక్తం సరఫరా కాక మూర్చ వచ్చి పడిపోతారని తద్వారా అవయవాలు ఆడక నిరసించిపోతారని అందుకోసం ప్రతి ఒక్కరూ నిమ్మరసం, మజ్జిగ ,పండ్ల రసాలు ,కొబ్బరి నీళ్లు మరి యు గంట గంటకు మంచినీళ్లు దాహమేక పోయిన తాగాలని సూచించారు.

ఈ కార్యక్ర మంలో తెలంగాణ సాంస్కృతిక సారథి కోఆర్డినేటర్ తిరుపతి నాయక్, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు రవిశంకర్, కిరణ్, ఎర్ర నరసింహ ,ఎర్ర బాలయ్య, చల్లా లక్ష్మి, అరుణ, రాధా, జ్యోతి, సుగుణ, జమీర్, హజార్ తదితరులు పాల్గొన్నారు.