calender_icon.png 8 January, 2025 | 7:09 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వైద్య ఆరోగ్యశాఖ కార్యక్రమాలపై కళాజాత

07-01-2025 06:56:08 PM

మందమర్రి (విజయక్రాంతి): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఆద్వర్యంలో ఆరోగ్య కార్యక్రమాలపై కళా జాత ద్వార పట్టణ ప్రజలకు అవగాహన కల్పించారు. మంగళవారం పట్టణంలోని మార్కెట్ ఏరియాలో  డిఎంహెచ్ఓ డాక్టర్ హరీష్ రాజ్ జాతీయ ఆరోగ్య మిషన్ ఆరోగ్య కార్యక్రమాలపైన కళాజాత అవగాహన కార్యక్రమం ప్రారంభించి మాట్లాడారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు గిరిజన ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని గ్రామాలలో 40 అవగాహన కార్యక్రమాలు చేపట్టడానికి ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందులో భాగంగా పట్టణంలోని మార్కెట్లో ప్రారంభించడం జరిగిందన్నారు.

ముఖ్యంగా ఆయుష్మాన్ భవ ఆరోగ్య కేంద్రాలు డిజిటల్ మిషన్ 100% గర్భవతుల నమోదు 100% టీకాలు ఇప్పించడం జాతీయ క్షయ, కుష్టు నివారణ కార్యక్రమాలు, వ్యాధులను గుర్తించడం, అవగాహన కల్పిస్తున్నామన్నారు. అలాగే కుటుంబ సంక్షేమ కార్యక్రమాలలో భాగంగా మగవారికి వేసిక్టమి, మహిళలకు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించడం, హెచ్ఐవి ఎయిడ్స్, వంటి అంశాలపై జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా ప్రజలకు అందుతున్న వైద్య సేవలను తెలియజేయడానికి కళాకారుల ద్వారా అవగాహన కలిగించడం జరుగుతుందన్నారు. అంతే కాకుండా ప్రస్తుతం వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని ముఖ్యంగా ప్రజలు మాస్కులు ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ రమేష్, జిల్లా మాస్ మీడియా అధికారి వెంకట సాయి, బుక్క వెంకటేశ్వర్, కళాకారులు రమేష్ బృందం, వైద్య సిబ్బంది, ఆరోగ్య ఆశా కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.