23-03-2025 12:34:21 AM
హైదరాబాద్, మార్చి 22 (విజయక్రాంతి): కేఎల్‌హెచ్ హైదరాబాద్‌లో 21, 22 తేదీల్లో బచ్చుపల్లి క్యాంపస్‌లో కళా ఉత్సవ్ ఘనంగా నిర్వహించారు. కేఎల్‌హెచ్ వైస్ ప్రెసిడెంట్ కొనేరు హవీష్ ఉత్సవాలను ప్రారంభించారు.
భారతీయ సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడేందుకు, యువ ప్రతిభను ప్రోత్సహించేందుకు కేఎల్‌హెచ్ స్టూడెంట్ ఆక్టివిటీ సెంటర్ (ఎస్‌ఏసీ), తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన ఈ జాతీయ స్థాయి వేడుకకు దేశవ్యాప్తంగా విద్యార్థులు, కళాకారులు, నర్తకులు, సంగీత కళాకారులు, రచయితలు, ఫోటోగ్రాఫర్లు, సినీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు.
మూడు వేల మందికి పైగా ప్రేక్షకులు హాజరయ్యారు. నవీన్ కుమార్ (ఐఏఎస్ యూపీ), సినీ నటుడు ప్రణవ్ కౌశిక్, సీడ్స్ ఫార్మ్ వ్యవస్థాపకుడు కిషోర్ ఇండుకూరి, చైర్‌పర్సన్, డైరెక్టర్ ఎస్‌ఏసీ ఇంజి పి. సాయివిజయ్, ప్రిన్సిపాల్ డా.ఎల్. కోటేశ్వరరావు, ప్రిన్సిపాల్ డా.రామకృష్ణ ఆకెళ్ల డా. జి. రాధాకృష్ణ, కన్వీనర్ శ్రీ జి. ప్రేమ సతీష్‌కుమార్ పాల్గొన్నారు.