హాజరైన ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి...
చెన్నూర్ (విజయక్రాంతి): కోటపల్లి మండలం పారుపల్లిలోని కాల భైరవ జయంతి ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. ఉత్సవాలకు చెన్నూర్ ఎమ్మెల్యే వివేక్ వెంకట స్వామి హాజరు కాగా ఆలయ కమిటీ సభ్యులు, పూజారి పూర్ణకళశంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తుల అభ్యర్థన మేరకు కాల బైరవుడి ఆలయానికి సీసీ రోడ్డు త్వరలోనే వేయిస్తానని ఎమ్మెల్యే హామి ఇచ్చారు. ఎండోమెంటుతో మాట్లాడి పూజారిని నియమిస్తామన్నారు. ఈ ఉత్సవాలకు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.