calender_icon.png 22 November, 2024 | 4:53 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విశ్వవిద్యాల స్థాయి అథ్లెటిక్స్‌లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు

03-11-2024 08:50:27 PM

విశ్వవిద్యాల స్థాయి అథ్లెటిక్స్ లో సత్తా చాటిన జిల్లా క్రీడాకారులు 

రెండు బంగారు, రెండు రజిత పత కాలు కైవసం 

భద్రాద్రి కొత్తగూడెం,(విజయక్రాంతి): కాకతీయ విశ్వవిద్యాలయ స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో తమ ప్రతిభను చాటి రెండు బంగారు పతకాలు, రెండు రజిత పథకాలు ప్రవేశం చేసుకొని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఖ్యాతిని ప్రదర్శించారు. కొత్తగూడెం సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థులు, కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఝాన్సీ రాణి తెలిపిన వివరాల ప్రకారం... ఈ నెల రెండు, మూడు తేదీల్లో ఖమ్మంలోని సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంలో కాకతీయ విశ్వవిద్యాలయ ఇంటర్ కాలేజీ అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో కొత్తగూడెం సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల మహిళలు అత్యంత ప్రతిభ కనబరిచి పథకాలు సాధించారు. పాయం ఉషారాణి 10000 మీటర్ల పరుగు పందెం, 5000 మీటర్ల పరుగు పందాల్లో రెండు బంగారు పథకాలు, ఎం టాబు 1500 మీటర్ల పరుగు పందెం, 800 మీటర్ల పరుగు పందెంలో రెండు రజిత పథకాలు కైవశం చేసుకున్నారు. పథకాలు సాధించిన క్రీడాకారులను కళాశాల ప్రిన్సిపాల్తో పాటు ఉపాధ్యాయ బృందం పీడీస్ స్పందన ఆదివారం అభినందించాడు.