calender_icon.png 20 April, 2025 | 4:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

‘జేఈఈ’లో కాకతీయ విద్యార్థులకు ర్యాంకులు

20-04-2025 12:00:00 AM

హైదరాబాద్, ఏప్రిల్ 19 (విజయక్రాం తి): జేఈఈ మెయిన్స్ ఫలితాలలో నిజామాబాద్ జిల్లా కాకతీయ కళాశాల విద్యార్థులు తొలి ప్రయత్నంలోనే జాతీయ స్థాయి ర్యాం కు పొందారని కాకతీయ విద్యాసంస్థల చైర్‌పర్సన్ సీహెచ్ విజయలక్ష్మి తెలిపారు. జాతీ య ర్యాంకు సాధించిన మేఘన(824), సం కీర్త్ (1750), భానుప్రతాప్ (3820), ప్రవీన్ (7456)లను ఆమె శనివారం అభినందించారు.

వీరితోపాటు జే అర్వింద్ (11246), జీ వేదాక్షర్ (12385), వీ నికేతన్ (21519), ఏ హాసిని(30243), పీ అమృత్‌వర్ష్ (390 52), ఎండీ ముదాషీర్ (43733), ఎస్ తనూజ (44161), ఎం భవ్యశ్రీ (48472) ర్యాంకులు సాధించారు. 99.48, 97.18, 95.35, 95.03, 93.68, 93.65, 91.95, 91.08, 90.15 ఇలా 90శాతం పర్సంటైల్‌పైన 9 మంది కాకతీయ విద్యార్థులు ఇంటర్ తో పాటు తొలి ప్రయత్నంలో జాతీయ స్థాయిలో ఆల్ ఇండియా ర్యాంకులను సాధించారని డైరెక్టర్ సీహెచ్ రామోజీరావు తెలిపారు.

విశేషమైన కృషినందించిన అధ్యాపక బృందానికి, ప్రోత్సాహాన్ని అందించిన తల్లిదండ్రులకు వారు కృతజ్ఞతలు తెలిపారు. అభినందన కార్యక్రమంలో ఐఐటీ అధ్యాపక బృందం, కాకతీయ విద్యాసంస్థల ప్రిన్సిప ల్స్ రణధీష్‌శర్మ, సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపల్ శ్యాం, జ్యోత్స్న, సిబ్బంది పాల్గొన్నారు.