calender_icon.png 23 April, 2025 | 3:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇంటర్ ఫలితాల్లో కాకతీయ ప్రభంజనం

23-04-2025 12:13:37 AM

నిజామాబాద్, ఏప్రిల్ 22 (విజయక్రాంతి): ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నిజామాబాద్ కాకతీయ కళాశాల ప్రభంజనం సృష్టించింది. మంగళ వారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని కాకతీయ విద్యాసంస్థల డైరెక్టర్ సిహెచ్ తేజస్విని తెలిపారు. ఎంపీసీ మొదటి సంవత్సరంలో బీ కావ్య శ్రీ 467 మార్కులతో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంక్, ఎం హర్షిత, టీ నిత్య శ్రీ, ఎం మృదుల, బి లాస్య శ్రీ 466 మార్కులతో మూడో ర్యాంక్, కే కీర్తి, ఎం ఆశ్రిత 465 మార్కులు సాధించారని తెలిపారు. బై పీసీ మొదటి సంవత్సరంలో హనీయ ఉమేర, వీ  ఇందు 435, టూబా ఫాతిమా, రిమ్ష ఆనం, వై శ్రీనిత్య 434 మార్కులు సాధించారు.

ఎంపీసీ రెండో సంవత్సరంలో సఫా అకిల్ 992 మార్కులు సాధించి రాష్ట్ర స్థాయి మూడో ర్యాంక్, త్రిష చౌదరి 991, అయేషా ఫాతిమా 988, జీ శ్రీలేఖ 987, ఏం లోకేష్ 987 సాధించారు. బై పీసీ రెండో సంవత్సరంలో అంతుల్ హడి మహ్రీన 992, జూనేరియా అంబర్ 992, సోహా సానిల 988, ఎంఈసీ విభాగం లో  అమ్మోల్ సర్వత్ 983, సీఈసీలో ఎస్ వేదిక 966 మార్కులు సాధించారు. వీరిని కళాశాల ఛైర్పర్సన్ సీహెచ్ విజయ లక్ష్మి, అధ్యాపక బృందం అభినందించింది. కార్యక్రమంలో ప్రిన్సిపల్స్ రణదీష్ శర్మ, సందీప్ కులకర్ణి, వైస్ ప్రిన్సిపాల్స్ శ్యామ్, జ్యోత్స్న తదితరులు పాల్గొన్నారు.