calender_icon.png 16 January, 2025 | 12:08 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కాక వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ విజేత రాజు భాయ్ టీమ్

15-01-2025 10:19:06 PM

మందమర్రి (విజయక్రాంతి): పట్టణంలో కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఆధ్వర్యంలో నిర్వహించిన కాకా వెంకటస్వామి స్మారక క్రికెట్ టోర్నమెంట్ లో భాగంగా బుధవారం జరిగిన ఫైనల్ మ్యాచ్ లో పట్టణానికి రాజు బాయ్ టీం విజేతగా నిలిచింది. నిఖిల్ టీమ్, రాజు భాయ్ టీమ్ లు ఫైనల్ మ్యాచ్ లో తలపడగా రాజు భాయ్ టీమ్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పట్టణ ఎస్సై రాజశేఖర్ పాల్గొని విజేతలకు బహుమతులు అందచేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... యువత చెడు మార్గంలో వెళ్లకుండా క్రీడల పట్ల ఆసక్తి కనబరిచి సన్మార్గంలో ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గుడ్ల రమేష్, మంద తిరుమల్ రెడ్డి, గుంట శ్రీశైలం, సట్ల సంతోష్, బియ్యపు రవికిరణ్, జవిద్ ఖాన్, ఇసాక్, యూత్ నాయకులు పాల్గొన్నారు.