calender_icon.png 24 November, 2024 | 12:20 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కైలాస్ నాలా ప్రాజెక్టు నీటి విడుదల

24-09-2024 05:37:57 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా  ప్రాజెక్టులోకి  ఎగువ భాగం నుంచి ఇన్ఫ్లో కొనసాగుతుండడంతో ప్రాజెక్టు ఒక వరద గేటు ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు ఏఈ రవిశంకర్ తెలిపారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 458.00 మీటర్లు 1.237 టీఎంసీలతో నిండి ఉండగా ఎగువ భాగం నుంచి 526 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుండడంతో 571 క్యూసెక్కుల నీటిని వరద గేటు ద్వారా మరో 100 క్యూసెక్కుల నీటిని ప్రధాన కాలువ ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు