calender_icon.png 12 March, 2025 | 1:10 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కైలాపూర్ జీపీ ట్రాక్టర్ బ్యాటరీ అపహరణ ?

11-03-2025 09:45:42 AM

చిట్యాల(విజయక్రాంతి): మండలంలోని ఓ గ్రామ పంచాయతీకి సంబంధించిన ట్రాక్టర్ బ్యాటరీ దొంగతనానికి గురైనట్లు తెలిసింది. వివరాల్లోకి వెళితే జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలం(Chityal Mandal) కైలాపూర్ గ్రామపంచాయతీకి సంబంధించిన జిపి ట్రాక్టర్ జిపి ఆవరణంలో ఉంటుంది. అయితే  సోమవారం సాయంత్రం చెట్లకు నీళ్లు పట్టాలనే ఉద్దేశంతో సిబ్బంది ట్రాక్టర్ ని తీయడానికి ప్రయత్నించారు.

ట్రాక్టర్కు సంబంధించిన బ్యాటరీ లేకపోవడంతో కంగుతిన్నారు. రాత్రి సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు బ్యాటరీని దొంగలించినట్లు గ్రామపంచాయతీ సిబ్బంది నిర్ధారించుకున్నారు. దీనిపై చిట్యాల ఎంపీడీఓను "విజయక్రాంతి" వివరణ కోరగా బ్యాటరీ అపహరణకు గురైన విషయం నిజమేనని తెలిపారు. దీనిపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. కానీ సిబ్బంది నిర్లక్ష్యం(Staff Negligence) మూలంగానే ట్రాక్టర్ బ్యాటరీ అపహరణకు గురైందని గ్రామస్తులు గుసగుసలాడుతున్నారు.