calender_icon.png 25 March, 2025 | 9:29 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర మంత్రిని కలిసిన కడ్తాల్ బీజేపీ నాయకులు

24-03-2025 12:29:15 AM

కడ్తాల్, మార్చి 23 (విజయక్రాంతి):  హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే జాతీయ రహదారి ఎన్ హెచ్ 765 చాలా రద్దీగా మారి ప్రమాదాలు ఎక్కువగా జరుగుతుండడంతో వెంటనే శ్రీశైలం జాతీయ రహదారిని నాలుగు లైన్లుగా విస్తరించి పనులు ప్రారంభించాలని తెలియజేస్తూ ఆదివారం మాజీ జాతీయ ఓబీసీ కమిషన్ సభ్యులు తల్లోజు ఆచారి ఆధ్వర్యంలో కడ్తాల్ మండల బిజెపి నాయకులు, కేంద్ర క్యాబినెట్ మంత్రివర్యులు గంగాపురం  కిషన్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం జరిగింది

ఈ విషయంపై కేంద్ర మంత్రి  సానుకూలంగా స్పందించి ఈ రోడ్డు యొక్క డిపిఆర్ పూర్తి అయినది అని చెప్పి అతి త్వరలో రోడ్డు విస్తీర్ణం కోసం టెండర్లను పిలిచి పనులు ప్రారంభిస్తామని సానుకూలంగా స్పందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎస్టి మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షులు సాయిలాల్ నాయక్, బిజెపి కడ్తాల్ మండల అధ్యక్షులు  దోనాదుల మహేష్, బిజెపి జిల్లా కౌన్సిల్ సభ్యులు శ్రీశైలం గౌడ్, మాజీ అధ్యక్షులు మ న్యానాయక్, లక్ష్మణ్ నాయక్ జంగం వెంకటేష్ గౌడ్ మల్లేష్ నాయకులు పాల్గొన్నారు.