calender_icon.png 17 April, 2025 | 9:23 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఆరోపణలు నిరూపిస్తే పదవికి రాజీనామా చేస్తా... మీ ఇంట్లో గులాంగా ఉంటా: కడియం శ్రీహరి

08-04-2025 03:01:13 PM

హైదరాబాద్,(విజయక్రాంతి): దేవునూరు గుట్టలను ఆక్రమిస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు చేస్తున్న భూకబ్జా ఆరోపణలను స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఖండిచారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ... తన 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఎలాంటి అక్రమాలు చేయలేదని, బీఆర్ఎస్ నేతలు తను 2 వేల ఎకరాలు కబ్జా చేసినట్లు దుష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు. బినామీలకు భూములు అప్పగించే ప్రయత్నం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోందని, ఎలాంటి ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తున్నాని వ్యాఖ్యానించారు. కబ్జా చేసినట్లు నిరూపిస్తే ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్య ఇంట్లో గులాంగా పని చేస్తానంటూ కడియం సవాల్ విసిరారు. తనపై వస్తున్న ఆరోపణలను నిరూపించకపోతే మీరు నాకు గులాంగా ఉంటారా..? అని ప్రశ్నించారు. తప్పుడు ఆరోపణలపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని కడియం శ్రీహరి పేర్కొన్నారు.