calender_icon.png 12 January, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సీఎం రేవంత్‌రెడ్డి కృషి ఉంది.. ఇది అందరి విజయం: కడియం శ్రీహరి

01-08-2024 11:52:04 AM

హైదరాబాద్‌: ఎస్సీ, ఎస్టీ వర్గీకరణపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. సీజేఐ జస్టిస్‌ చంద్రచూడ్‌ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం గురువారం తీర్పు వెలువరించింది. ఎస్సీ వర్గీకరణను సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. వర్గీకరణకు రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని ధర్మాసనం తెలిపింది. సుప్రీం కోర్టు తీర్పుపై కడియం శ్రీహరి స్పందించారు. ఎస్సీ వర్గీకరణపై  సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ఇచ్చిందన్నారు. కల నెరవేరిందన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి కృషి ఉందని కడియం పేర్కొన్నారు. ప్రత్యేకంగా సుప్రీంకోర్టుకు మంత్రిని పంపి, ప్రత్యేక అడ్వకేట్ ని నియమించారని తెలపారు. చాలా ఆనందంగా ఉంది.. ఇది అందరి విజయం కడియం శ్రీహరి వెల్లడించారు.