calender_icon.png 28 September, 2024 | 2:55 AM

కడియం మతిభ్రమించి మాట్లాడుతున్నాడు

28-09-2024 12:45:59 AM

మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య

హైదరాబాద్, సెప్టెంబర్ 27 (విజయక్రాంతి): మాజీమంత్రి కడి యం శ్రీహరి మతిభ్రమించి మాట్లాడుతున్నారని, ఎన్నికల రావంటూనే బీఆర్‌ఎస్‌కు డిపాజిట్ దక్కదనడం విడ్డూరంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య మండిపడ్డారు. స్టేష న్ ఘన్‌పూర్ 2004 నుంచి 2014 వరకు కడియం శ్రీహరిని మరిచిపోయిందని, తెల్లారి లేస్తే కేసీఆర్ పక్కనే ఉన్న కడియం అభివృద్ధి జరగలేదనడం హాస్యాస్పదంగా ఉందన్నారు.

అభివృద్ధిలో ఘన్‌పూర్ నాలుగో స్థానంలో ఉందని ఆనాడే ఆంగ్ల పత్రికలో వచ్చిందని, ఏడు రిజర్వాయర్లుతో 3 పంటలు పండించేటంత అభివృద్ధి జరిగిందన్నారు. చెక్‌డ్యాంలు కట్టి, భూగర్భజలాలు పెం చుకున్నామనానరు. 25 వేల జనాభాతో ఏర్పడే ఘన్‌పూర్ మున్సి పాలిటీని ఆనాడు అడ్డుకున్నదని కూడా కడియం అన్న సంగతి ప్రజ లు మరిచిపోలేదన్నారు.

రెండుసా ర్లు విద్యాశాఖ మంత్రిగా ఉన్న కడి యం కో డిగ్రీ కళాశాల కూ డా తీసుకురాలేదన్నారు. ఉద్యమం లో సిద్దిపేటతో పోటీ పడ్డ ఘన్‌పూర్‌లో కరుడు కట్టిన బీఆర్‌ఎస్ శ్రేణు లు ఉన్నారని, బీఆర్‌ఎస్ శ్రేణుల కష్టంతో గెలిచి అదే పార్టీకి డిపాజిట్ రాదనడం విడ్డూరంగా ఉందన్నారు.

ఎమ్మెల్యే పదవి బీఆర్‌ఎస్ కార్యకర్తలు పెట్టిన భిక్ష అని, కేసీఆర్ ఏ ఎమ్మెల్యే ఇంటికెళ్లి కండువా కప్పలేదని, సీఎం రేవంత్ రెడ్డి అందరి ఇం డ్లకొచ్చి కండువా కప్పినట్లు పేర్కొన్నారు. కేసిఆర్‌ది అవినీతి పాలన అయితే పదేండ్లు ఆయన పక్కనే ఉన్న కడియం శ్రీహరి వాటా ఎంత అని ప్రశ్నించారు. ఎన్నికలొస్తే అటు కాంగ్రెస్, ఇటు బీఆర్‌ఎస్ శ్రేణులు కడియంను ఓడించడమే లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు.