మహబూబాబాద్ (విజయక్రాంతి): హన్మకొండ జిల్లా అయినవోలు మండల కేంద్రంలోని సుప్రసిద్ద ప్రసిద్దిగాంచిన శైవ క్షేత్రం మల్లికార్జున స్వామిని స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి దంపతులు దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారికి ఆలయ పూజారి పూర్ణకుంభతో స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో దేవాలయం కార్యనిర్వాహణాధికారి అద్దంకి నాగేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు.