18-03-2025 03:28:42 PM
రాజేంద్రనగర్: బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాడెం సుధాకర్ ను మంగళవారం నియమించారు. ఈ సందర్భంగా కాడెం సుధాకర్ మాట్లాడుతూ.. పార్టీ ఆవిర్భవించినప్పటి నుంచి అంకితభావం, చిత్తశుద్ధితో పనిచేస్తున్నట్లు తెలిపారు. దేశం కోసం ధర్మం కోసం పని చేసే పార్టీ లో నరేంద్ర మోడీ నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా, ఆనందంగా ఉందని పేర్కొన్నారు.
పార్టీ అధిష్టానం కష్టపడి పని చేసే కార్యకర్తలను గుర్తించి పదవులు ఇచ్చి గౌరవిస్తుందన్నారు. తనపై ఎంతో నమ్మకం తో రెండవ సారి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ గా నియమించడం సంతోషంగా ఉందని సుధాకర్ తెలిపారు. మరింత ఉత్సాహంతో పని చేస్తానన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను గడప గడపకు చేరేలా తన వంతు కృషి చేస్తానని తెలిపారు. పార్టీ బలోపేతానికి మరింత పనిచేస్తానని అన్నారు.