calender_icon.png 24 January, 2025 | 7:00 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కడెం ప్రాజెక్ట్ కు వరద పోటు.. 18 వరద గేట్ల ఎత్తివేత

02-09-2024 03:30:28 PM

నిర్మల్,(విజయక్రాంతి): జిల్లాలోని కడెం నారాయణరెడ్డి ప్రాజెక్టుకు వరద పెరగడంతో సోమవారం 18 గేట్లను ఎత్తి 2 లక్షల క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి వదులుతున్నారు. కడెం ప్రాజెక్టు ఎగువ ప్రాంతాలైన ఇచ్చోడ, సిరిసిల్ల, నేరడిగొండ, గుడ్ ఆఫ్టర్ సోనాల బోత్, ఇంద్రవెల్లి తదితర మండలాల్లో వర్షాలు కురవడంతో భారీ ఎత్తున ప్రాజెక్టులోకి వరదరావడంతో అధికారులు నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. కడెం ప్రాజెక్టులోకి వస్తున్నవరదల్లో ఆదివారం రాత్రి ఓ ముసలి కొట్టుకొచ్చింది. అది గుర్తించిన స్థానికులు దాన్ని గట్టుపైకి చేర్చారు. దీంతో అధికారుల సమక్షంలో ముసలికి మళ్ళీ నీటిలోకి వదిలినట్లు తెలిపారు.