కడలికి, కాన్వాస్‌కు విడదీయలేని బంధం ఉంటుంది. కడలిని కాన్వాస్‌పై బంధిచొచ్చు. కానీ కడలిపై కాన్వాస్‌పైన బంధిస్తారా? అది సాధ్యం కాదు. కానీ రెండింటిని కలిపి ఒకే ఫ్రేమ్‌లో అద్భుతంగా చూపించేవారే ఆర్టిస్టులు. కడలి సాక్షిగా.. కళాకారులు అనేక సంఘర్షణలకు లోనవుతూ.. సమాజం హితాన్ని కోరుకుంటూ.. కాన్వాస్‌పై రంగుల ప్రపంచాన్ని సృష్టిస్తారు. కాన్వాస్‌పై వాడే ప్రతిరంగుతో లోతైన భావాన్ని, బాధను, భావోద్వేగాన్ని వ్యక్తపరుస్తారు. మన ఆర్టిస్టులు ట్రెడిషనల్ ఆర్ట్స్‌ను అప్డేట్ చేసుకుంటూ.. ఆర్టిస్టులుగా తమ వర్క్‌లోని ప్రత్యేకతలను ఖజానాతో పంచుకున్నారు.
రూప
ఇది రెగ్యులర్ వర్క్ కాదు..
నాది హైదరాబాద్. ఇంటర్ తర్వాత డ్రాయింగ్, పెయింటింగ్‌పై ఇష్టం ఏర్పడ్డది. క్రమంగా అదే నా జీవిత గమ్యమైంది. వాస్తవానికి దగ్గరగా ఉన్న పెయింటిగ్స్‌ను మాత్రమే నేను ఇష్టపడతాను. ఆయిల్ పెయింటింగ్స్ మీద ఎక్కువ దృష్టిపెడతాను. కవితలంటే ఇష్టం.. నా వర్క్‌లో ఎక్కువగా భావోద్వేగాలను చూపిస్తాను. ఆర్ట్‌ను వదిలిపెట్టి ఏ రోజు ఉండలేదు. రెండు దశబ్దాల కాలంలో ఎన్నో పెయింటింగ్స్ వేశాను.
పెళ్లి తర్వాత మధ్యలో కొంత గ్యాప్ వచ్చింది. కొన్నిసార్లు ఫ్యామిలీ లైఫ్‌లో లాక్ అయిపోతానేమో అనే భయం కలిగేది. కానీ అలా ఏం జరగలేదు. నాకు ఒక బాబు.. వాడ్ని చూసుకుంటూ.. ఫ్యామిలీని లీడ్ చేసుకుంటూ నా ఆర్ట్ వర్క్‌ను కొనసాగిస్తున్నా. ఆర్టిస్టు వర్క్ అనేది రెగ్యులర్ వర్క్‌లా ఉండదు. ఇది క్రియేటివీటికి సంబంధించినది. మన మూడ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటూ.. వ్యక్తపరిచేది.
కొన్నిసార్లు వర్క్ ఆలస్యంగా బయటకు రావడం.. ఆగిపోవడం జరుగుతుంది. కానీ ఎంత పని ఒత్తిడి ఉన్నా సరే.. దీన్ని కొనసాగించాలి నిర్ణయం తీసుకోవాలి. ఇతర కారణాల వల్ల దీన్ని ఎక్కువ కాలం కొనసాగించలేను అనుకున్న సందర్భాలు ఉన్నాయి. కానీ దీన్ని వదిలిపెట్టి ఉండలేను. మైండ్ రిఫ్రెష్ అవ్వడానికి కొంత సమయం పడుతుంది అంతే. ఎన్ని పనులున్నా.. కాన్వాస్ వైపు మాత్రమే నా మనసు లాగుతుంది. సమాజంలో ఒక అపోహ ఉంది. ఆడపిల్లలు ఎక్కవకాలం కళాకారులుగా ఉండలేరని.. కానీ అలా ఏం కాదు.
అన్నింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ.. ప్రత్యేకంగా మనకు ఇష్టమైన దానిపై ఏకాగ్రతగా దృష్టి పెడితే సాధించలేనిది అంటూ ఏది ఉండదని నా అభిప్రాయం. సామాన్య జనానికి, ఆర్టిస్టుకు తేడా ఏంటి అంటే.. ఏదైనా ఘటన జరిగితే.. మిగతా వాళ్లు అయ్యే పాపం అంటారు.. కానీ ఆర్టిస్టు మాత్రం అలా కాదు. తనకు నచ్చిన కవితనో.. డ్రాయింగో.. పెయింటింగో.. వేసే వరుకు నిద్రపట్టదు.
రుక్మిణి కర్లపాలెం
ప్రింట్ మేకింగ్‌తో!
నేను పుట్టి, పెరిగిదంతా బెంగుళూర్‌లోని దేవనహల్లి. చిన్నప్పటీ నుంచి మా దగ్గర గురుకుల పద్ధతిలో నడిపించే ఓ స్కూల్ ఉండేది. ఆ స్కూల్‌కు నేను ఒక అలవాటుగా వెళ్లేదాన్ని. అక్కడ స్కల్పర్, డ్రాయింగ్, శ్లోకాలు నేర్పించేవారు. ట్రెడిషనల్‌తో పాటు మిగతా ఆక్టివిటీస్ కూడా నేర్పించేవాళ్లు. డ్రాయింగ్ కాకుండా.. స్కల్పర్, క్లే వర్క్ ఇలా అన్నీ నేర్పించేది. గ్రానైట్ వరకు నేర్పిస్తారు.
అయితే నేను స్టోన్ వర్క్ చేయలేకపోయా.. బెంగుళూలోనే కేన్ స్కూల్ ఆఫ్ ఆర్ట్‌లో జాయినయ్యా. అక్కడ ఐదేళ్లపాటు కోర్సు నేర్చుకున్నా.. కేన్ స్కూల్ తర్వాత మాస్టర్స్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేశా.. నా స్పెషలైజేషన్ ప్రింట్ మేకింగ్. ఒక ఆర్ట్ వర్క్‌ను ఇలాగే చేయాలని ఏం లేదు. ఒక ఆర్ట్‌ను ఎన్నో పద్ధతుల్లో వ్యక్తీకరించవచ్చు.
ప్రింట్ మేకింగ్ అనేది ఒక ఆర్ట్ వర్క్‌గా మా త్రమే ఉంటుండే.. ఇప్పుడు అలా కాక కాన్వాస్ మీద డిజిటల్ కూడా వచ్చింది. ప్రకృతిలో సహజంగా లభించేదానికి.. కృతిమంగా తయారు చేసుకున్న దానికి చాలా తేడా ఉంటుందని నా అభిప్రాయం. ప్రస్తుతం జేఎన్‌టీయూలో విజిటింగ్ ప్రొఫెసర్‌గా చేస్తున్నాను.
పుష్పవతి
ఆర్ట్‌ను వదిలిపెట్టలేను!
నాకు ఇన్‌స్పిరేషన్ మా అన్నయ్య. జేఎన్‌టియూలో డిగ్రీ పూర్తి కాగానే.. బెంగుళూరు ప్ర భుత్వ కాలేజీలోనే పీజీ చేశాను. డిగ్రీ చేసే వరకు ఆర్ట్ గురించి పెద్దగా తేలియదు. డిగ్రీ చదువు తున్న క్రమంలో చాలా నేర్చుకున్నా.. ఇండియా, వెస్ట్నర్ ఆర్ట్ గురించి తెలుసుకున్నాక ఆర్ట్‌ను వదిలిపెట్టలేకపోయా. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అధ్యయనం, పరిశోధన చేస్తే కొత్త కొత్త విషయాలు అవగాహనకు వస్తాయి.
దాంతో క్రియేటివిటీ పెరుగుతుంది. మనం వేసే ఆర్ట్ ఒక పదిమందికి ఇన్‌స్పిరేషన్ కావాలి. ఏదో ఒక ఆర్ట్ వేయడం నాకిష్టం ఉండదు. ఏ ఆర్టిస్టు అయినా అప్డేట్ అవ్వడం చాలా అవసరం. మనం ఎంచుకునే సబ్జెక్ట్ ఒకేలా ఉన్నా.. ప్రజెంటేషన్ మాత్రం వేరుగా ఉండాలి. ప్రస్తుతం ప్రపంచదేశాల మధ్య యుద్ధాలు జరుగుతున్నాయి. మతాలు, కులాల మీదే ఎక్కువగా యుద్ధాలు జరుగుతాయి.
దాంట్లో రక్తపాతాలు జరుగుతుంటాయి. దాన్నే ఒక సబ్జెక్టులాగా తీసుకొని.. ఒక తరగతి గదిలో టీచర్ విద్యార్థులకు క్లాస్ చెబుతుంటే.. విద్యార్థులు ఒక్కో మతానికి చెందినవారుంటారు.. వారిలో కొందరు హింసించడం.. మరికొందరు చిత్రహింసలకు గురికావడం వంటివి ఉం టాయి. ఇక్కడ అందరికీ రక్తం అనేది ప్యూర్‌గా ఉంటుంది.
కానీ మతాలు, కులాల ద్వారా స్టూడెంట్స్ మైగ్రేట్ అవుతుంటారు అనేది నా కన్సెఫ్ట్. ఉపాధ్యాయుల సరిగ్గా నేర్పించకపోతే.. విద్యార్థుల భవిష్యత్ నాశనం అవుతుందని నా పెయింటింగ్‌లో చూపించా. అలా సమాజానికి ఉపయోగపడే వర్క్స్ చేయడం నాకిష్టం.
సతీష్ దావత్
ఇంటరాక్టివ్ ఆర్ట్..
నేను విజువల్ ఆర్టిస్టును. జెఎన్‌ఎఫ్‌యులో మాస్టర్స్ అయిపోయింది. మొదట్లో చిన్నచిన్న డ్రాయింగ్స్ వేసేది. దాని తర్వాత కొంచెం ఫొటోగ్రఫీ మిక్స్ చేసి వర్క్ చేయడం మొదలెట్టా. తర్వాత చేసిన వర్క్స్ అన్నింటిని కలిపి వీడియో సొంతంగా క్రియేట్ చేశాను. కమ్యూనికేషన్ అనే సబ్జెక్ట్‌పైన మన అగ్గిపెట్టెలను తీసుకొని వాటిని డిజైన్ చేసి వర్క్ చేశాను. ఆర్టిస్టుకు సామాజిక బాధ్యత చాలా అవసరం.
మనం చేసే ప్రతి పని డైరెక్టుగా కాకుండా ఇన్‌డైరెక్ట్‌గా అయినా సరే ఒకరికి ఉపయోగపడాలి. నా వర్క్ విషయానికొస్తే.. ఇంటరాక్టివ్ అండ్ ఫొటో ఆర్ట్. ఇంటరాక్టివ్ ఆర్ట్‌కు ఒక ఉదాహరణ.. కొన్ని పావురాలు.. నేలపైన ఉంటాయి. మనం వాటి దగ్గరకు వెళ్తే అవి ఎగిరిపోతాయి. మనం ప్రతిరోజూ ఇలాంటి విజువల్స్‌ను చూస్తునే ఉంటాం. దాన్నే ఇంటరాక్టివ్ ఆర్ట్ అంటారు. ఒక వ్యక్తి పావురం దగ్గరకు వెళ్తేనే.. అది ఎగిరిపోతుంది.
దీంతోపాటు సౌండ్ ఆర్ట్ కూడా చేశా.. సౌండ్ ఎలాగంటే.. మన దగ్గర చిన్న చిన్న పక్షులు ఉంటాయి కదా.. అవి నీళ్ల దగ్గరకు వస్తే వచ్చే శబ్దాన్ని క్రియేట్ చేశాను. అది కొంచెం సెన్సర్స్, స్పీకర్స్‌తో చేశాను. మన దగ్గర ముఖ్యంగా ఆదివాసీ ప్రాంతాల్లో రకరకాల పక్షుల శబ్దాలను వినొచ్చు. ఏదైనా ప్రమాదం ఉన్నప్పుడు ఈ సెన్సర్‌ను ఉపయోగిస్తే అలెర్ట్ అవుతారని క్రియేట్ చేశాను.
సుజిత్ శక్తి