calender_icon.png 27 February, 2025 | 9:27 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

విద్యార్థుల అభ్యున్నతికి అంకితభావంతో పనిచేసే అధ్యాపకులను విద్యార్థులు మర్చిపోరు

27-02-2025 06:41:24 PM

హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి  ఓ. వడ్డన్న

ముషీరాబాద్,(విజయక్రాంతి): విద్యార్థుల  అభ్యున్నతికి  అంకితభావంతో పనిచేసే అధ్యాపకులను విద్యార్థుల జీవితంలో మర్చిపోరని హైదరాబాద్ జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి ఓ. వడ్డన్న(District Intermediate Education Officer O. Vaddanna) చెప్పారు. ఈ మేరకు గురువారం కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లైబ్రేరియన్ కే. సురేష్ కుమార్(Kachiguda Govt Junior College Librarian K. Suresh Kumar) పదవి వివరణ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...  ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న పేద విద్యార్థులు తమ పిల్లలుగా భావించి వారి అభివృద్ధికి అధ్యాపకులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. లైబ్రేరియన్ సురేష్ కుమార్(Librarian Suresh Kumar) లాంటి అనుభవజ్ఞులు కొత్తవారికి తన సలహాలు, సూచనలు అవసరం ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర ఆర్టీవో జాయింట్ కమిషనర్ రమేష్ కుమార్(RTO Joint Commissioner Ramesh Kumar) మాట్లాడుతూ... కష్టపడి పని చేసే వారికి ఎప్పటికీ సమాజం గుర్తిస్తుందని ఆయన చెప్పారు.

సురేష్ కుమార్ తక్కువ కాలంలో పరిచయం ఎంతో పేరు ప్రఖ్యాతిని సంపాదించుకున్నారని ఆయన కొనియాడారు. కాచిగూడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ చిరంజీవి మాట్లాడుతూ విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ వారికి  సహకారాలు అందించడంలో సురేష్ కుమార్ ముందుంటారని ఆయన చెప్పారు,  సురేష్ కుమార్ లాంటి ఉత్తమ లైబ్రేరియన్ పదవి విరమణ పొందడం బాధగా ఉన్నప్పటికీ ప్రభుత్వ ఉద్యోగులకు పదవి విరమణ తప్పని సరి అని ఆయన చెప్పారు .ఈ కార్యక్రమంలో తెలంగాణ లైబ్రేరియన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి  శివకుమార్. రాష్ట్ర జూనియర్ కాలేజ్ ఫిజికల్ డైరెక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షులు డాక్టర్ బి, లక్ష్మయ్య‌ ,హైదరాబాద్ జిల్లా జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు వి ,ప్రసాద్ రావు ప్రధాన కార్యదర్శి బాలయ్య. హైదరాబాద్ జిల్లా లైబ్రరీస్ అసోసియేషన్ అధ్యక్షులు బి, లక్ష్మయ్య , సీనియర్ లెక్చరర్స్ గీతాబాయి, రామ్మోహన్‌ అనిల్ రెడ్డి. రజిని. బాలమణి రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.