calender_icon.png 15 November, 2024 | 3:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కబ్జా చెయ్.. పాగా వెయ్!

31-08-2024 01:56:47 AM

పట్టా మాటున ప్రభుత్వ భూమి ఆక్రమణ

కళ్లుండీ చూడలేని అధికార యంత్రాంగం

ఆపై ఆక్రమణదారులకే అండదండలు

హైడ్రాను విస్తరిస్తే వాస్తవాలు వెలుగులోకి..

భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 30 (విజయక్రాంతి): పేదోడు తల దాచుకొనేందుకు మూరెడు జాగాలో గుడిసె వేస్తే ప్రభుత్వ భూమి అంటూ దౌర్జన్యంగా నేలమట్టం చేసే రెవెన్యూ అధికారులు.. ఆర్థిక, అంగ బలం ఉన్న పెద్దోడికి మా త్రం రెడ్ కార్పెట్ పరుస్తున్నారు. ఆక్రమణలకు పూర్తి సహాయ సహకా రాలు అందజేస్తున్నారు. కోట్ల విలువైన ప్ర భుత్వ భూమిని దర్జాగా కబ్జా చేసుకున్నా త మకేమీ కనబడదు అన్నట్టు వ్యవహరిస్తున్నా రు.

నాడు భద్రాద్రి జిల్లా పాల్వంచ పట్టణ పరిధిలోని వెంగళరావు కాలనీలో ఓ వ్యక్తి 5 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జాచేసి సాగుచేస్తుంటే, తాజాగా ఇందిరాకాలనీలో మరో ప్ర భుద్దుడు సర్వే నంబర్ 817/1లో మూడెకరాల ప్రభుత్వ భూమిని, సర్వే నంబర్ 817/ 58 పట్టా భూమి మాటున ఆక్రమించి ఏకం గా ఫంక్షన్ హాల్ నిర్మించేశాడు. ఒక వైపు ప్ర భుత్వం హైడ్రా ఏర్పాటుచేసి ప్రభుత్వ భూ ములు, నాలాలు, చెరువులు, అసైన్‌మెంట్ భూముల్లోని అక్రమాలను నేలమట్టం చేసి పరిరక్షిస్తుంటే, పారిశ్రామిక ప్రాంతమైన పా ల్వంచలో అదే అధికార పార్టీ అండదండలతో ప్రభుత్వ భూమిని దర్జాగా ఆక్రమిచు కోవడం కలకలం రేపుతుంది.  

ముందు పాగా.. ఆపై   

పాల్వంచ పట్టణ సరిహద్దు ప్రాంతమైన ఇందిరాకాలనీ వద్ద ప్రభుత్వ భూమి సర్వే నంబర్ 817/1లో మూడు ఎకరాలు ఆక్రమించి, పట్టాభూమి సర్వే నెం 817/ 58 రికార్డులు చూపి అక్రమార్కుడు రెవె న్యూ, మున్సిపల్, ఫైర్, విద్యుత్ అధికారుల అండదండలతో దర్జాగా ఫంక్షన్ హాల్ నిర్మి ంచాడు. సదరు నిర్మాణానికి పాల్వంచ ము న్సిపాల్టీలో ఓ మహిళ పేరుతో ఇంటి నం బర్ 20 0002 పొందారు.  అయి తే, అటు మున్సిపల్ అధికారులు, ఇటు గ్రామపంచాయతీ అధికారుల నుంచి ఎ లాంటి అనుమతులు పొందకపోవడం గమనార్హం.  ఇంత జరుగుతున్నా మున్సిపల్ అధికారులు, రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెతి చూడకపోవడం ఆరోపణలకు తావిస్తోంది. తన అక్రమాలు బయటికి రాకుండా సదరు వ్యక్తి సామాజిక సేవ ముసుగులో దందా కొనసాగిస్తున్నాడని ఆరోపణలు ఉన్నాయి.  

నాడు తహసీల్దార్ పరిరక్షించిన భూమి..

గతంలో శైని కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో ప్రభుత్వ భూముల పరిరక్షణ కార్య క్రమానికి శ్రీకారం చుట్టారు. కలెక్టర్ ఆదేశా లతో అప్పటి తహసీల్దార్ శర్మ.. పాల్వంచ మండలంలో దాదాపు 20 నుంచి 30 ఎకరాల ప్రభుత్వ భూమిని పరిరక్షించి ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. నాడు తహసీల్దార్ పరరిక్షించిన ప్రభుత్వ భూమిలో నేడు కబ్జాదారుల దర్జాగా భవంతులు నిర్మిస్తున్నారు. మండల పరిధిలోని కేశవాపురం పంచాయతీ సమీపంలో 817/1లో కొంత మంది నిరుపేదలు ఇళ్లు నిర్మించుకొంటే, వాటిని తొలగించి స్వాధీనం చేసుకొని, చుట్టూ ఫెన్సింగ్ నిర్మించారు.

శర్మ బదిలీ అయిన తర్వాత వచ్చిన మరో తహసీల్దార్ హయాంలోనే ఆక్రమణలు మళ్లీ పెరిగాయని బహిరం గంగానే ఆరోపణలు ఉన్నాయి. ఫంక్షన్ హాలు కు వెళ్లేందుకు రోడ్డును సైతం ప్రభుత్వ భూమిని ఆక్రమించి నిర్మించడం గమనార్హం. చిన్న ఇంటి నిర్మాణానికి సవాలక్ష షరతులు విధించే అధికారులు.. ప్రభుత్వ భూమిలో కట్టిన ఫంక్షన్ హాల్‌కు మాత్రం అనుమతులు ఎలా ఇచ్చారోనని ప్రజలు చర్చించుకుంటున్నారు. అన్నింటికి మించి ఆ ప్రాంతం 1/70 యాక్టు పరిధిలో ఉండటం గమనార్హం. హైదరాబాద్ మాదిరిగానే పాల్వంచలోనూ హైడ్రాసేవలను విస్తరిం చాలని పాల్వంచ పట్టణ ప్రజలు కోరుతున్నారు.  

ఎలాంటి అనుమతులు ఇవ్వలేదు 

పాల్వంచ పట్టణ పరిధిలోని ఇందిరాకాలనీ సమీపంలో హెచ్ కన్వెన్షన్ హాల్‌కు తాము ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వలేదని, తమకు ఎలాంటి దరఖాస్తులు రాలేదని పాల్వంచ మున్సిపాల్టీ టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. అయితే ఇంటి నంబర్ ఎలా వచ్చిందని అడుగగా, నిర్మాణం ఉంటే చాలు ఇంటి నంబర్ ఇవ్వవచ్చని చెప్పారు. అనుమతితో పనిలేదని పేర్కొన్నారు. హెచ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం జరిగిన ప్రదేశం ప్రభుత్వ భూమిలో ఉందా? పట్టా భూమిలో ఉందా? తెలియాలంటే తప్పని సరిగా సర్వే చేయాల్సి ఉంటుందని పాల్వంచ పట్టణ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ రవికుమార్ చెప్పారు.