calender_icon.png 3 February, 2025 | 4:16 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కభీ కభీ మేరే దిల్ మే..

03-02-2025 01:27:38 AM

‘కభీ కభీ మేరే దిల్ మే ఖయాల్ ఆతా హై’ పాట ఆమె కోసమే పుట్టిందా? 

అన్నట్టుగా ఉండేది. 70ల్లో ఆమెను చూడగానే ప్రతి ఒక్కరి మదిలో ఈ పాట ప్రతిధ్వనిస్తూ ఉండేది. చూడచక్కటి రూపం.. అద్భుతమైన నటన.. వెరసి ఆమెను స్టార్‌ని చేశాయి. ఏ సినిమా అయితే ఆమెను అంతెత్తున నిల బెట్టిందో.. అదే సినిమా ఆమె రియల్ లైఫ్‌లో సుడిగుండాలు సృష్టించింది. ఆ నటి మరెవరో కాదు.. ప్రేక్షక హృదయాలను ఏలిన మహారాణి.. రాఖీ గుల్జార్.

దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజే అంటే 15 ఆగస్ట్ 1947లో రాఖీ గుల్జార్ జన్మించారు. అది దేశానికి స్వాతంత్య్రం వచ్చిన రోజు.. తను స్వాతంత్య్రాన్ని కోల్పోయిన రోజని ఆమె సరదాగా చెబుతుంటారు. రాఖీ తన 16 ఏళ్ల వయసులోనే బెంగాలీ జర్నలిస్ట్ అయిన అజయ్ బిస్వాస్‌ను వివాహం చేసుకున్నారు. కానీ రెండేళ్లకే ఇద్దరూ విడిపోయారు. ఆ తరువాత పదేళ్లకు బాలీవుడ్ ప్రముఖ రచయిత, నిర్మాత గుల్జార్‌ను వివాహం చేసుకున్నారు. ఈ వీరి వివాహ జీవితం కూడా ఎంతో కాలం సాగలేదు. కొంత కాలానికే ఒక పాప పుట్టిన అనంతరం ఇద్దరూ విడిపోయారు. 

రీల్ లైఫ్..

బెంగాలీ చిత్రం ‘బధు భరన్’తో సినీ రంగ ప్రవేశం చేశారు. ‘జీవన్ మృత్యు’తో బాలీవుడ్ ఎం ట్రీ ఇచ్చారు. నాలుగు దశాబ్దాల పాటు తన నట జీవితాన్ని గడిపిన రాఖీ 100కు పైగా చిత్రాల్లో నటించారు. ‘ఆంఖోన్ ఆంఖోన్ మే’, ‘దాగ్: ఎ పోయెమ్ ఆఫ్ లవ్ చిత్రాలు ఆమె కెరీర్‌ను మలు పు తిప్పాయి. ‘బ్లాక్ మెయిల్, కభీ కభీ, బర్సాత్ కీ ఏక్ రాత్, దూస్రా ఆద్మీ, తృష్ణ, ముకద్దర్ కా సికిందర్, కాలా పత్తర్, జుర్మానా’ వంటి ఎన్నో చిత్రాల్లో నటించారు. వివాహానంతరం ఆమె చేసిన తొలి చిత్రమే ‘కభీ కభీ’. 

భర్తతో విడిపోవడానికి..

1975లో రొమాంటిక్ డ్రామా ‘ఆంధీ’ సినిమా షూటింగ్ కోసం కశ్మీర్‌కు వెళ్లాల్సి వచ్చింది. అప్పుడు రాఖీని సైతం తనతో తీసుకువెళ్లారు. ఒకరోజు షూటింగ్ ముగిసిన అనంతరం.. ‘ఆంధీ’ చిత్రంలో నటించిన వారందరితో రాత్రి సమయంలో మేకర్స్ గెట్ టు గెదర్ ఏర్పాటు చేశారట. సంజీవ్ బాగా డ్రింక్ చేసి సుచిత్రను బలవంతంగా తన గదికి తీసుకెళ్లేందుకు యత్నించారట.

దీనిని గుల్జార్ అడ్డుకున్నారట. సుచిత్రా సేన్‌ను హోటల్‌లోని తమ గదికి గుల్జార్ తీసుకెళ్లారట. దీంతో గుల్జార్, సుచిత్రా సేన్‌ల మధ్య సంబంధం ఉందని గుల్జార్ అనుమానించారట. అదే వారిద్దరి మధ్య గొడవకు కారణమైందట. గుల్జార్ ఎంత చెప్పినా రాఖీ వినలేదట. అదే సమయంలో యశ్ చోప్రా ‘కభీ కభీ’ కథతో ఆమెను సంప్రదించారట.

వివాహానంతరం తను సినిమాలు చేయనన్న ఒప్పందాన్ని విస్మరించి కనీసం భర్త పర్మిషన్ కూడా తీసుకోకుండా రాఖీ ఆ సినిమాకు సైన్ చేసిందట. ఈ రెండు కారణాలు వారిద్దరి మధ్య పెద్ద అగాధాన్ని సృష్టించాయి.

తను సృష్టించుకున్న స్వర్గంలో..

ప్రస్తుతం రాఖీ ముంబై శివారులోని తన ఫామ్ హౌస్(రూట్స్) లోనే జీవిస్తున్నారు. అక్కడ ఆమె కొన్ని జంతువులను పెంచుతున్నారు. పక్షులు, మూగ జీవాలతో తన సృష్టించుకున్న స్వర్గంలో నివసిస్తున్నారు.  తనకు డబ్బుతో పని లేద ని.. తాను మూగ జీవాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతున్నానని రాఖీ ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తెలిపారు.