calender_icon.png 26 October, 2024 | 12:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

క అంటే కంటెంట్

16-07-2024 12:10:00 AM

కిరణ్ అబ్బవరం, నయన్ సారిక, తన్వీ రామ్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న పీరియాడిక్ థ్రిల్లర్ చిత్రం “క”. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో రానున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం ద్వారా సుజీత్, సందీప్ దర్శకులుగా పరిచయం కానున్నారు. త్వరలో తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో విడుదల కానున్న ఈ సినిమా టీజర్ సోమవారం హైదరాబాద్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి చిత్ర బృందంతో పాటు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్, దర్శకుడు సతీష్ వేగేశ్న హాజరయ్యారు. ఈ సందర్భం గా నిర్మాత చింతా గోపాలకృష్ణ రెడ్డి మాట్లాడుతూ -“మూడు ‘క’ లను నమ్ముకుని “క” సినిమా నిర్మించాను. మొదటిది కథ.

రెండోది కథానాయకుడు. మూడోది కల. చిత్ర పరిశ్రమలో ఒక మంచి సినిమా నిర్మించి పది మందికి తోడుగా ఉండాలని, సినిమా ఇండస్ట్రీకి ఉపయోగపడాలని మొదట నుంచి సంకల్పించుకున్నాను. ఆ కల “క”  సినిమాతో నెరవేరుతోంది” అన్నా రు. హీరో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ “ఎస్‌ఆర్ కల్యాణ మండపం, రాజా వారు రాణి సినిమాలకు మంచి ఆదరణ లభించింది. తర్వాత చేసిన సినిమాల్లో ఎంపికప రంగా మెరుగ్గా ఉండాలనిపించింది. మంచి సినిమాలు చేయాలన్న తపనతోనే సినిమాల్లోకి వచ్చాను. నటుడిగా అందరూ చూపి స్తున్న అభిమానానికి మరింత కష్టడాలనిపిస్తుంటుంది. “క” అంటే కంటెంట్. ఆ కంటెం ట్‌ను మా డైరెక్టర్స్ డిజైన్ చేశారు. వారు కథ చెప్పినప్పుడు ప్రేక్షకుల దృష్టితోనే రాసినట్లు అనిపించింది. “క” తో ఒక మంచి మూవీ ఇవ్వబోతున్నా” అని తెలిపారు.