హీరో కిరణ్ అబ్బవరం ఓ భారీ పీరియాడిక్ థ్రిల్లర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఆ చిత్రం పేరు ‘క’. బుధవారం టైటిల్ అనౌన్స్ చేస్తూ మేకర్స్ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్‌లో హీరో కిరణ్ మేకోవర్ ఆసక్తి కలిగిస్తోంది. విలేజ్ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఈ చిత్రాన్ని దర్శక ద్వయం సుజీత్, సందీప్ తెరకెక్కిస్తున్నారు. శ్రీచక్రాస్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాను త్వరలో తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో థియేటర్ల ద్వారా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నామని చిత్రబృందం తెలిపింది. కాగా, ఈ సినిమాకు సంగీతం: సామ్ సీఎస్; సినిమాటోగ్రఫీ: విశ్వాస్ డానియేల్.