calender_icon.png 26 February, 2025 | 4:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఓయూలో 2కే వాకథాన్

26-02-2025 01:49:36 AM

ఎస్‌ఎల్‌బీసీ ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలు

హైదరాబాద్, ఫిబ్రవరి 25: ఆర్థిక అక్షరాస్యతా వారోత్సవాలను ఈ నెల 24 తేదీల మధ్య నిర్వహించాలని దేశ వ్యాప్తంగా ఉన్న బ్యాంకులను రిజర్వ్ బ్యాంకు తాజాగా కోరింది. హైదరాబాద్ ఆర్బీఐ శాఖ సమన్వయంతో రాష్ట్రస్థాయి బ్యాంకర్ల కమిటీ(ఎస్‌ఎ ల్‌బీసీ) మంగళవారం ఉదయం 6.30 గంటలకు ఉస్మా  యూనిర్సిటీ క్యాంపస్‌లో ‘2కే వాకథాన్’ నిర్వహించింది.

విద్యార్థులతోపాటు దాదాపు 400 మంది ఆర్బీఐ, బ్యాంకు అధికారులు పాల్గొన్నారు. వాకథాన్ అనంతరం ఆర్బీఐ హైదరాబాద్ శాఖ డిప్యూటీ జనరల్ టీ జగదీశ్‌కుమార్ ప్రసంగించారు. ఈ ఏడాది ఆర్థిక అక్షరాస్యతా వా  థీమ్‌ను ‘మహిళల శ్రేయస్సు’గా పేర్కొన్నారు. బ్యాంకర్లు తమ మహిళా కస్టమర్లకు ఆర్థిక అంశాలపై విస్తృత అవగాహన కల్పించాలని కోరారు. అనంతరం ఎస్బీఐ హైదరాబాద్ సర్కిల్ సీజీఎం రాజేశ్ కుమార్ మాట్లాడుతూ ఆర్థికవృద్ధిలో మహిళల సహకరాన్ని వివరించారు.