27-04-2025 07:12:43 PM
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం(Telangana State Govt) ఆదివారం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి కె.రామకృష్ణారావు(IAS officer K. Ramakrishna Rao)ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1991 ఐఏఎస్ బ్యాచ్ కు చెందినా కె.రామకృష్ణారావు... కొత్త సీఎస్ గా బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం రామకృష్ణారావు ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుత సీఎస్ శాంతి కుమారి ఈ నెల 30న పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.