29-04-2025 01:23:08 AM
ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం
హైదరాబాద్, ఏప్రిల్ 28 (విజయక్రాంతి): తెలంగాణ రాష్ట్ర విద్యు త్ నియంత్రణ మండలి(ఈఆర్‌సీ) సభ్యులుగా కే రఘు, చెరుకూరి శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్య కా ర్యదర్శి సందీప్‌కుమార్ సుల్తాని యా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. వీరు 5 ఏళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్‌కి చెం దిన శ్రీనివాసరావు 2016, జూలై 26 నుంచి ట్రాన్స్‌కో జేఎండీగా కొనసాగుతున్నారు. అంతకుముందు టీజీ ఎస్పీడీసీఎల్ డైరెక్టర్‌గా పనిచేశారు. కే రఘు ప్రస్తుతం ట్రాన్స్‌కో ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నారు. 2017-22 మధ్య ట్రాన్స్‌కో చీఫ్ ఇంజినీర్ గా పనిచేశారు.