calender_icon.png 18 April, 2025 | 10:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బిచ్కుందలో ఘనంగా జ్యోతిరావు పూలే మహాత్మా జయంతి వేడుకలు

11-04-2025 08:16:00 PM

బిచ్కుంద (విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం బిచ్కుంద మార్కెట్ కమిటీ  కార్యాలయంలో శుక్రవారం కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో మాహత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. వారు మాట్లాడుతూ... ఆయన కృషి వారు చేసిన త్యాగాలను గుర్తించారు మహాత్మ జ్యోతిరావు పూలే జాతిపిత సామాజిక సంస్కర్త సామాజిక జ్ఞానోదయం కలిగించిన వ్యక్తి విప్లవాత్మక కార్యకర్త, అక్షర అభ్యుదయానికి పాటుపడిన మహానేత, మహిళలు, దళితుల అభ్యున్నతి కోసం అహర్నిశలు పాటుపడిన మహనీయుడు, మూఢనమ్మకాలను, కుల వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించే మహానేత, సత్యశోధకు సమాజ్ సంస్థను నిర్మించి మహిళా హక్కుల కోసం బాల్యవివాహాలను వ్యతిరేకించిన మహా మహానీయుడు గొప్ప వ్యక్తి అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు దర్పల్ గంగాధర్ పిసిసి డెలిగేట్ విట్టల్ రెడ్డి మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగ్ నాథ్ పటేల్ కాంగ్రెస్ నాయకుడు పెద్దలు పాల్గొన్నారు.