calender_icon.png 18 April, 2025 | 11:10 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన వేదిక ఆధ్వర్యంలో ఘనంగా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు

11-04-2025 06:59:06 PM

బెల్లంపల్లి (విజయక్రాంతి): పూలే, పెరియార్, అంబేద్కర్ ఆలోచన వేదిక, ఎం21 ఆధ్వర్యంలో శుక్రవారం మహాత్మ జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను నాయకులు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో పూలే పెరియార్ అంబేద్కర్ ఆలోచన వేదిక అధ్యక్షులు గుడిసెల శ్రీహరి అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మహనీయుల విగ్రహాలకు నివాళులర్పించారు. అనంతరం సీ కమల్ - ఏం 21 జాతీయ కమిటీ సభ్యులు, విగ్రహ దాత దాగం మల్లేష్ మాట్లాడారు.

మహాత్మ జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే ఈ దేశానికి చేసిన సేవ ఎనలేనిదని కొనియాడారు. పేదల కోసం ఉచిత పాఠశాలలు ఏర్పాటు చేసి అందరికీ చదువు చెప్పడం వల్లనే, ఈరోజు మనమందరం చదువుకొని ఉన్నత స్థాయి వరకు ఎదగడం జరిగిందని అన్నారు. కుల నిర్మూలన కోసం, అంటరానితనంపై  విరోచిత పోరాటం చేసిన మహనీయుడు పూలే అన్నారు. స్త్రీ విద్య కోసం పోరాడి బానిస సంకెళ్ళను తెంచేందుకు కృషి చేసిన మహనీయుడు అని అన్నారు. చదువుల తల్లి సావిత్రిబాయి పూలే మహిళలకు చదువు చెప్పిన భారతదేశ మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలన్నారు. 

ఈ కార్యక్రమంలో వేల్పుల కనకయ్య, జి .ఏ జ్యోతి కుమార్, ఎన్ .దేవేందర్, మాజీ డిజిఓ అధ్యక్షులు దుబాసి రవి, గుడిసెల స్వామి, పొట్ల శేఖర్, గుడిసెల చంద్రమౌళి, మిట్టపెల్లి మల్లయ్య, రంగ ప్రశాంత్, రత్నం ఐలయ్య, రవి శంకర్, ఎమ్మార్పీఎస్ పట్టణ అధ్యక్షలు రామగిరి మహేష్, కార్యదర్శి నాతరి శివ, గుమస రాజం, మాసం మురళి కె. నారాయణ, కె.రాజలింగు, గజ్జల రాంనాథ్, గోడి సెల అవినాష్, శ్రీనాథ్, ఎల్తూరి శంకర్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.