calender_icon.png 19 April, 2025 | 11:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి జ్యోతిరావు ఫూలే

12-04-2025 01:00:40 AM

ఎమ్మెల్సీ ఎల్ రమణ

జగిత్యాల అర్బన్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): సామాజిక ఉద్యమాలకు మార్గదర్శి జ్యోతిరావు పూలే అని బిఆర్‌ఎస్ సీనియర్ నాయకులు, ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎల్. రమణ అన్నారు. మహాత్మ జ్యోతిరావు పూలే 199వ జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణంలోని జ్యోతిరావు ఫూలే పార్కు లో మహాత్మా జ్యోతిరావు పూలే  విగ్రహానికి ఎల్ రమణ, మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత తో కలిసి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ బడుగు బలహీనవర్గాల ఆశాజ్యోతి పూలే  స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో సామాజిక ఉద్యమాలు రూపుదిద్దుకున్నాయని అన్నారు.

బహుజన చైతన్య దీప్తిగా, వివక్షలపై పోరాడి మహిళా విద్యకు విశేష కృషి చేసిన సంఘ సంస్కర్త పూలే అని కొనియాడారు. పూలే స్ఫూర్తితో సామాజిక సాధికారత కోసం తెలంగాణలో  సమగ్ర కుల గణన చేపట్టడం, బీసీలకు 42% రిజర్వేషన్, ఎస్సీ వర్గీకరణ వంటి అనేక నిర్ణయాలు తీసుకున్న విష యాలను ఎమ్మెల్సీ ఎల్ రమణ  ప్రస్తావించారు. తదుపరి జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి వేడుకలలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ముసిపట్ల లక్ష్మీనారాయణ, మానాల కిషన్, కొక్కు గంగాధర్, రాంచందర్ తదితరులు పాల్గొన్నారు.