calender_icon.png 19 April, 2025 | 4:30 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిబాపూలేకు భారతరత్న ప్రకటించాలి

11-04-2025 12:00:00 AM

జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు 

మంచిర్యాల, ఏప్రిల్ 10 (విజయక్రాంతి) : సమసమాజ స్థాపకుడు జ్యోతిబాపూలే కు కేంద్ర ప్రభుత్వం భారతరత్న ప్రకటించాలని జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి నాయకులు డిమాండ్ చేశారు. గురువారం అదనపు కలెక్టర్ సభావత్ మోతీలాల్‌కు వినతి పత్రం అందజేసిన అనంతరం వారు మాట్లాడారు.

దేశ స్వతంత్రానికి ముందే సమాజంలో అంటరానితనం నిర్మూలన, కుల వివక్షపై పోరాటం చేసిన వ్యక్తి, మూఢ నమ్మకాలు రాజ్యమేలుతున్న రోజుల్లో మూఢనమ్మకాలపై ప్రజలను చైతన్యవంతులను చేసిన వ్యక్తి, సతీసహగమనం, బాల్య వివాహాలు, వితంతు వివాహాల నిర్మూలనకు పాటుపడి తన జీవితాన్ని సమాజానికి అంకితం చేసిన గొప్ప సంఘసంస్కర్తకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సరైన గుర్తింపు ఇవ్వకపోవడం బీసీలపై వివక్షగా భావిస్తున్నామన్నారు.

ఇప్పటికైనా జ్యోతిబాపూలే జ యంతిని వర్ధంతిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు. పార్లమెంటు ప్రాంగణంలో పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు గుమ్ముల శ్రీనివాస్, నాయకులు చెలిమెల అంజన్న, బండా సతీష్, బోడంకి కుమార్, గోలివాడ వంశీ, అంకం సతీష్, తదితరులు పాల్గొన్నారు.