11-04-2025 07:40:47 PM
జగదేవపూర్ (విజయక్రాంతి): జగదేవపూర్ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద మహాత్మ జ్యోతిబాపూలే చిత్రపటానికి సిద్దిపేట జిల్లా బీజేవైఎం ఉపాధ్యక్షులు గుర్రం శ్రీధర్ ఆధ్వర్యంలో పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఓబిసి మోర్చా జిల్లా జనరల్ సెక్రెటరీ గర్నెపల్లి కృష్ణమూర్తి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఏప్రిల్ నెల అంటేనే మహనీయుల మాసం అని ఎంతోమంది బడుగు బలహీనుల కోసం పోరాడిన ప్రజా సేవకులని గుర్తు చేశారు.
నేడు మహిళలు చదువుకుంటున్నారు అంటే అది జ్యోతి బాపులే గొప్ప తనం అని కొనియాడారు. విద్య కోసం అహర్నిశలు కృషి చేసిన జ్యోతిరావు పూలే ఆదర్శప్రాయుడు అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుంకు కుమార్, మండల ఉపాధ్యక్షులు కొంతం సుధాకర్, కార్యదర్శి బత్తుల వెంకటేష్, బీజేవైఎం మండల అధ్యక్షులు నర్ర రాజ్ కుమార్ బీజేవైఎం జనరల్ సెక్రెటరీ పోచమైన సురేష్, బూత్ అధ్యక్షులు ముచ్చపతి సురేందర్, నర్ర బాలయ్య, తాడం రజనీకాంత్, ధర్మారం వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.