calender_icon.png 20 April, 2025 | 11:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జ్యోతిబా ఫూలే సేవలు మరువలేనివి

12-04-2025 12:00:00 AM

జయంతి వేడుకల్లో వక్తల వెల్లడి

ఆదిలాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి, స్త్రీల విద్య కోసం పాటుపడిన మహాత్మా జ్యోతి బా ఫూలే అందరికి ఆదర్శప్రాయుడని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఫూలే జయంతి వేడుకలను బీసీ స్టడీ సర్కిల్ లోని పూలే విగ్రహానికి, భూక్తాపూర్ లోని పూలే చౌక్ లో గల జ్యోతి బా పులే చిత్రపటానికి ఎమ్మెల్యే పాయల్ శంకర్, డీసీసీబీ చైర్మన్ అడ్డి బోజారెడ్డి తో కలిసి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.

తరువాత జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన జ్యోతి బా పూలే జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన గావించి మహాత్మా జ్యోతి బా పూలే చిత్ర పటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలకు విద్యను అందించేందుకు అహర్నిశలు శ్రమించిన మహాత్మ జ్యోతిరావు పూలే కులాలకు అతీతంగా బడు గు బలహీన వర్గాల సంక్షేమం కోసం, వారిలో ఆత్మ స్థైర్యం కల్పించి హక్కుల కోసం పోరాడి సాధికారతకు కృషి చేశారని అన్నారు.

తన భార్య సావిత్రిబాయి పూలేతో కలిసి దేశంలో మహిళలకు విద్యను అందించేందుకు పాఠశాలలను ప్రారంభించి విద్య ను సమాన హక్కుగా మహిళలకు అందించేందుకు కృషి చేశారని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ మహాత్మా జ్యోతి బాపూలే చేసిన కృషి మరువలేనిదని ఆయన ఆశయాలను, అడుగుజా డల్లో నడవాలని  అన్నారు.

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, ఆర్డీఓ వినోద్ కుమార్, బీసీ సంక్షేమ శాఖ అధికారి రాజలింగు , డీసీసీబీ చైర్మన్ భోజారెడ్డి, బిసి సంఘ  అధ్యక్షులు దత్తు, సెక్రటరీ శ్రీనివాస్, మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుకుమార్, బీసీ సంఘం నాయకులు పాల్గొన్నారు.