calender_icon.png 19 April, 2025 | 11:42 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నెక్లెస్ రోడ్డులో జ్యోతిబాఫూలే విగ్రహం

12-04-2025 01:07:26 AM

స్థలాన్ని పరిశీలించిన సీఎం, డిప్యూటీ సీఎం, పీసీసీ చీఫ్ 

హైదరాబాద్, ఏప్రిల్ 11 (విజయక్రాంతి): మహాత్మా జ్యోతిబాఫూలే విగ్రహ ఏర్పాటు విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. ఫూలే జయంతి రోజే హైదరాబాద్ నెక్లెస్ రోడ్ ఐమాక్స్ సమీపంలో ఆయన విగ్రహ ఏర్పాటుకు శుక్ర వారం సీఎం రేవంత్‌రెడ్డి స్థలాన్ని పరిశీలించారు.

డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, పలువురు ఎమ్మెల్యేలు, జీహెఎంసీ మేయర్ విజయలక్ష్మి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, బీసీ సంఘాల నేతలు జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు ఆయన వెంట ఉన్నారు. విగ్రహం ఏర్పాటుకు సంబంధించి స్థలం కోసం సర్వే చేసి పూర్తిస్థాయి ప్రణాళికలతో నివేదికను అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. భవిష్యత్‌లో ట్రాఫిక్ తదితర సమ స్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని, డిజైనింగ్ రూపకల్పన చేయాలని సూచించారు.

జ్యోతిరావు ఫూలేకు సీఎం ఘననివాళి

హైదరాబాద్ సిటీబ్యూరో, ఏప్రిల్ 11(విజయక్రాంతి): మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతిని పురస్కరించుకొని శుక్రవారం అంబర్‌పేట్‌లోని ఫూలే విగ్రహానికి సీఎం రేవంత్‌రెడ్డి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కాంగ్రెస్ నేతలు, అభిమానులతో సీఎం కరచాలనం చేశారు.
టీపీసీసీ అధ్యక్షుడు బీ మహేశ్ కుమార్‌గౌడ్, కాంగ్రెస్ సీనియర్ నేత, రాజ్యసభ మాజీ సభ్యులు వీ హనుమంతరావు, రాజ్యసభ సభ్యులు అనిల్‌కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్,  భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్, డీసీసీ అధ్యక్షుడు డాక్టర్ రోహిన్‌రెడ్డి, బీసీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్, కాంగ్రెస్ నాయకులు లక్ష్మణ్‌యాదవ్, శ్రీకాంత్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సీఎం రాక సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.