మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో తెలుగమ్మాయి యర్రాజి జ్యోతి తన అదృష్టాన్ని పరీక్షించుకోనుంది. ఇటీవలి కాలంలో అంతర్జాతీయ స్థాయిలో వరస పతకాలతో దుమ్మురేపుతున్న జ్యోతిపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక మహిళల 4x400 మీటర్ల పరుగులో సుభ, విద్య, పూవమ్మతో కలిసి తెలుగమ్మాయి దండి జ్యోతిక శ్రీ పాల్గొననుంది. తండ్రి కల నెరవేర్చాలని అథ్లెటిక్స్‌ను కెరీర్‌గా ఎంచుకున్న జ్యోతిక.. ఇటీవలి కాలంలో వ్యక్తిగత అత్యుత్తమ రికార్డుతో టీమ్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తోంది. అదే జోరు ఒలింపిక్స్‌లోనూ కొనసాగిస్తే పతకం సాధించడం అంత కష్టం కాకపోవచ్చు. 20 కిలోమీటర్ల రేస్ వాక్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన ప్రియాంక గోస్వా మి, జావెలిన్ త్రోలో అన్ను రాణి కూడా పతకం ఆశలు రేపుతున్నారు.