25 May, 2026 | 4:24 AM

జ్యోతిర్వాణి జ్యోతిష సదస్సు

25-05-2026 12:00 AM

ఓయూలో ఆరోగ్యజ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరణ

సికింద్రాబాద్, మే 23 (విజయక్రాంతి): అస్మద్ గురుభ్యోన్నమః శ్రీ మాత్రే నమః వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో ఆదివారం జ్యోతిర్వాణి జ్యోతిష సదస్సును ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వేద సం స్కృతి పరిషత్  అధ్యక్షులు, ఉస్మానియా విశ్వవిద్యాలయం తెలుగు శాఖ ఆచార్యులు సాగి కమలాకరశర్మ, ముఖ్యఅతిథి దూరవిద్య కేం ద్రం ప్రధాన సంచాలకులు, ఆచార్య భట్టాచార్యులు విశిష్ఠ అతిథి దర్శనం మాస పత్రికల నిర్వాహకులు మరుమాముల వెంకటరమణ శర్మ, ఆత్మీయ అతిథి ఆచార్య కేటా మక్క శివ రాం ప్రసాద్, డాక్టర్ వైవీ రాజ్యలక్ష్మిరావు కీలకోపన్యాసం చేశారు. వైద్య జ్యోతిషం జ్యోతిర్ వైద్యం అనే అంశంపై ఆరోగ్య జ్యోతి ప్రత్యేక సంచిక ఆవిష్కరించారు.

జ్యోతిషానికి వైద్యానికి ఉన్న సంబంధాలను తెలియజేస్తూ రోగ నివారణ రోగ నిర్ధారణ గురించి నివారణ ఉపాయాలు తెలియజేస్తూ జ్యోతిష్యాన్ని వివరిస్తూ డాక్టర్ హరి ఉమాకాంత్, ఉపద్రస్ట సూర్యనారాయణమూర్తి, డాక్టర్ కృష్ణకాంత్, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ శ్రీవల్లి, దైవిజ్ఞ శర్మ ప్రసంగించారు. ఈ సదస్సులో జ్యోతిష్యం, శాస్త్రీయ అవగాహన, ముహూర్తఫణి మహిళా పంచాంగం ప్రకృతీ వైపరీత్యాలు, ప్రత్యేక పుస్తకావిష్కరణ చేశారు. అనంతరం జ్యోతిర్వాణి, వేద సంస్కృతి పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహించిన అష్టక వరకు, భావం ప్రభావం జ్యోతిర్ వైద్యం వంటి అంశాలపై విద్యార్థులందరికీ గురువు డాక్టర్ సాగే కమలాకర్ శర్మ చేత ధృవపత్రాలను అందజేశారు.