calender_icon.png 18 April, 2025 | 10:50 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

బడుగు వర్గాల చైతన్య శీలి జ్యోతిబాపూలే

11-04-2025 07:51:46 PM

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి..

కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): బడుగు బలహీన వర్గాల చైతన్య శీలి మహాత్మ జ్యోతి భాయ్ పూలే అని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహాత్మ జ్యోతిబాయ్ పూలే 198 జయంతి సందర్భంగా కామారెడ్డి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఘనంగా జయంతి వేడుకలను నిర్వహించారు. అనంతరం మున్సిపల్ ఎదుట ఉన్న ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అడిషనల్ రెవెన్యూ కలెక్టరు విక్టర్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మద్ది చంద్రకాంత్ రెడ్డి మాట్లాడారు.

మహాత్మ జ్యోతి భాయ్ పూలే బడుగు బలహీన వర్గాలను చైతన్యం పరిచి, స్త్రీ విద్య కోసం పాటుపడిన గొప్ప సంఘ సంస్కర్త అని కోనియాడారు. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి మహాత్మ జ్యోతి భాయ్ పూలేకి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. అనంతరం గౌరవ అడిషనల్ కలెక్టర్ విక్టర్ మాట్లాడుతూ... జ్యోతి భాయ్ పూలే, సత్య శోదక్ పుస్తకాన్ని రచించి సమాజాన్ని ఏర్పాటు చేసి బడుగు బలహీన వర్గాలను చైతన్యం చేయడం జరిగిందని చెప్పారు.

అలాగే "గులాం గిరి", అనే రచనలతో అణగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, రెవెన్యూ డివిజనల్ అధికారిని వీణ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, సంఘాల నాయకులు క్యాతం సిద్దిరాములు, కొత్తపల్లి మల్లయ్య, సాప శివరాములు, ఆకుల బాబు, నీల నాగరాజు, బత్తిని నాగభూషణం, మహేశ్ గౌడ్, చింతల శంకర్, రాజయ్య ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దయానంద్, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షులు నరాల వెంకట రెడ్డి, సిపిఓ రాజారాం, హాస్టల్ వార్డెన్లు, నాగరాజు సంబంధిత సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.